MLA Couple Celebrates 40th Anniversary with Public Service Spirit
ప్రజాసేవకే ఎమ్మెల్యే దంపతులు
ప్రజాపక్షం / శ్రీరాంపూర్
https://youtu.be/iVSPrhfij-c?si=GI0jGPPfeTeTtkQQ
మంచిర్యాల జిల్లా ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, వారి జీవితాలను పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేసిన ఎమ్మెల్యే దంపతులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ లని 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్ కొనియాడారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మల 40వ పెళ్లిరోజు సందర్భంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీరాంపూర్ బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి సుధాకర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి, అనేక సేవా కార్యక్రమాలను అందిస్తూ ప్రజల మనసులో ఆదర్శ దంపతులుగా నిలిచారని కొనియాడారు. ప్రజల ఆశీస్సులతో వారిద్దరు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ మరెన్నో పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
