మహా మండలంలో మెడికల్ మాఫియా జోరు.

నిబంధనలు అనుమతులకు తోట్లు జనరిక్ మందుల విక్రయాలు.

ప్రతి ఆర్.ఎం.పి వద్ద మెడికల్ షాపు నిర్వహణ.

మహాదేవపూర్ పలివెల మండలాల్లో 38 మెడికల్ షాపుల నిర్వహణ.

అద్దె ఫార్మసీ సర్టిఫికెట్, తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫార్మసిస్టులే.

కాసుల మత్తులో డ్రగ్స్ అధికారులు, అక్రమ మెడికల్ నిర్వహణపై నేటికీ చర్యలు లేవు, అధికారులకు అయ్యప్ప గుడి అక్షింతలు.!?.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

మెడికల్ షాప్ నిర్వహణ మందుల విక్రయాలు ఆషామాషీ వ్యవహారం కాదు అద్దె ఫార్మసీ సర్టిఫికెట్ తో నిర్వాహకునికి సంబంధించిన వారందరూ ఫార్మసిస్టులే అనుకుంటూ ప్రజలకు మందులు విక్రయించడం జరుగుతుంది. మెడికల్ షాప్ నిర్వహణకు సంబంధించి కనీస నిబంధనలు కూడా లేకుండా మహదేవ్పూర్ పలివెల ఉమ్మడి మండలంలో మెడికల్ మాఫియా రెచ్చిపోవడం జరుగుతుంది. నేడు ప్రజలు సత్వర ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మందుల దుకాణాలను నమ్ముకుని ఉండడం వాటిని ఆసరాగా చేసుకున్న మెడికల్ మాఫియా నిర్వాహకులు ఫార్మసీ కెమిస్ట్ అండ్ రిజిస్ట్ అనే పదాన్ని అద్దె సర్టిఫికెట్ తో నిర్వాహకుల కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు కూడా ఫార్మసిస్టుగా మారి మందులను విక్రయించడం జరుగుతుంది. ఇలా మందులు విక్రయించడం అమాయక రోగుల ప్రాణాలకు సంబంధించి కేవలం మందులపై ఉన్న ఎంఆర్పి ధర కి ప్రాధాన్యమిస్తూ కంపెనీ బ్రాండెడ్ మందులకు బదులు ఉమ్మడి మండలమంతా జనరిక్ బంధువులను విక్రయిస్తూ పేద రోగుల నుండి కాసులు దండుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉమ్మడి మండలం చరిత్రలోనే జిల్లా డ్రగ్ అధికారి మందుల దుకాణాల తనిఖీలు చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం లేవు.

మహా మండలంలో మెడికల్ మాఫియా జోరు.

మెడికల్ షాప్ మందుల దుకాణం నేడు ప్రజాజీవనంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందుల అవసరాలకు వేద ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరూ మెడికల్ షాప్ లో విక్రయించే మందులపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలో మందుల విక్రయాలకు సంబంధించి ప్రధాన గ్రామాలు ఒక మెడికల్ మాఫియాగా ఏర్పడి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఫార్మసీ అనుమతులు లేకుండా కేవలం బీఫార్మసీ సర్టిఫికెట్ లను అద్దెకు తీసుకొని నామమాత్ర మెడికల్ పరిజ్ఞానం ఉన్న లేకున్నా సులువుగా డబ్బు సంపాదించాలని ఆశతో ప్రజల ఆరోగ్యాలను కూడా చూడకుండా విచ్చలవిడిగా మెడికల్ షాపులు ఏర్పాటు చేసి మందులను విక్రయిస్తున్నారు. కేవలం ఒకరు ఇద్దరు బీఫార్మసీ అర్హత ఉండి మెడికల్ షాపులు నిర్వహిస్తున్న క్రమంలో ఓకే లైసెన్స్ పై వారు కూడా అనేక మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకుని మందులను విక్రయించడం జరుగుతుంది.

నిబంధనలు అనుమతులకు తోట్లు జనరిక్ మందుల విక్రయాలు.

మెడికల్ షాప్ నిర్వాహణ సాధారణ ఇతర దుకాణాలు ఏర్పాటు చేసినట్లు చేసే పరిస్థితి ఉండదు.డ్రగ్ లైసెన్స్ డిపాజిట్ ఫీజు లేదా చలాన్ ఇన్‌వాయిస్‌లు,ప్రాంగణం కోసం బ్లూప్రింట్ లేదా కీ ప్లాన్.ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకునే ఆధారం.యజమానులు లేదా భాగస్వాముల గుర్తింపు మరియు చిరునామా రుజువు,ప్రాంగణం యొక్క యాజమాన్య రుజువు,నమోదిత మరియు ,పూర్తి సమయం పని చేసే నమోదిత ఫార్మసిస్ట్ లేదా సమర్థ వ్యక్తి యొక్క అఫిడవిట్.డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ప్రకార కఠిన నిబంధనలతో మెడికల్ షాప్ నిర్వహణ తోపాటు విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి మండలంలో విచ్చలవిడిగా నిర్వహించబడుతున్న మెడికల్ షాపులకు ఇలాంటి అనుమతులు లేకున్నప్పటికీ సాధారణ గ్రామపంచాయతీ పరువు రిజిస్ట్రేషన్ తో బందుల దుకాణాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక మందుల విక్రయాలకు సంబంధించి కంపెనీ మందులకు హోల్ సేల్ ధర రిటైల్ ధరకు పోలిస్తే కేవలం 10% మార్జిన్ ఉంటుంది గనుక జనరిక్ మెడిసిన్ 60 శాతం మార్జిన్ లాభం రావడంతో మెడికల్ షాపుల్లో అన్ని జనరిక్ మందుల విక్రయాలు మరో విచిత్రం ఏమిటంటే ప్రైవేట్ కంపెనీలు శాంపుల్ అందించినటువంటి రిప్రెజెంట్ న్యూస్ ద్వారా వచ్చిన బంధువులను ఒక ప్రధాన నగరం నుండి నో సెల్ అని ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి మండలంలోని మెడికల్ షాపుల్లో విక్రయాలు జరపడం కొనసాగుతుంది.


ప్రతి ఆర్.ఎం.పి వద్ద మెడికల్ షాపు నిర్వహణ.

ఇక ప్రస్తుతం మహాదేవపూర్ గుమ్మడి మండలంలోని 26 గ్రామాల్లో ఒకవైపు మండల కేంద్రం నుండి మొదలుకొని ఆరు మూల ప్రాంతాల వరకు ప్రాథమిక చికిత్స కేంద్రం పేరుతో ఒక వ్యక్తి కుర్చీ వేసుకుని డాక్టర్ అంటూ తన పక్కకు మరో వ్యక్తి మందుల దుకాణం ఏర్పాటు చేసుకొని డాక్టర్ చిట్టి తీసుకున్న తర్వాత ఆ మెడికల్ షాపులకు వెళ్లి మందులు తీసుకోవడం ఆనవాయి, కానీ ఈ డాక్టర్ రాసింది ఏమిటి మెడికల్ షాప్ వివాహకుడు ఇచ్చిన మందులు తీసుకోవచ్చా అనే విషయానికొస్తే, ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే మందులు తక్కువ డోస్ ఉండడం కూడా ఇటు మెడికల్ నిర్వాహకులకు సంపాదించుకునే దారి అని చెప్పవచ్చు, ఎందుకంటే ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే పారాసెటమాల్ 200 ఎంజిలు ఉంటే అదే డోలో పారాసెటమాల్ 500 ఎంజి మెడికల్ షాపుల్లో ఇవ్వడం జరుగుతుంది, కేవలం 40 నిమిషాల్లోనే వచ్చిన జనాన్ని మాయం చేసే ఘనత మెడికల్ షాపు దక్కించుకుంది. దూల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఆ మెడికల్ షాప్ నిర్వాహకులు మీకు తెలుసా దూలపై అతనికి పరిజ్ఞానం ఉందా సాధారణ వ్యక్తి డోలో మెడిసన్ వేసుకోవచ్చా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులపై మెడికల్ నిర్వాహకునికి ఏమైనా తెలుసా అలాంటి ఏమి విషయాలు అవసరం లేదు, ఎందుకంటే దాని పేరు మెడికల్ షాప్ అది ఆ రోగికి రోగాన్ని తక్షణం సాయం చేస్తుంది. ఇలా ఆర్ఎంపీల ముసుగులో వేల రూపాయలు మెడికల్ షాపుల ద్వారా అమాయక పేద రోగులను బురిడీ కొట్టిస్తూ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఇలా సులువుగా అమాయకులను పెద్ద పెద్ద రోగాల్లో నెట్టే ప్రయత్నంలో తెలిసి తెలవని బంధువులను వారికి అందిస్తూ వేల రూపాయలను సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.

అద్దె ఫార్మసీ సర్టిఫికెట్, తో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫార్మసిస్టులే.

ఫార్మసిస్ట్ అవసరం లేదు మహదేవ్పూర్ మండలంలో మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకొని జనరిక్ మందులు ప్రజల్లో నాటుకుపోయిన కొన్ని కంపెనీ బంధువులను ఏజెన్సీల ద్వారా రప్పించుకొని మరోవైపు మెడికల్ రిప్రజెంటిటివ్ ల నుండి అందించే షాంపులను కూడా పెట్టుకుని ఫలానా మెడికల్ షాప్ అని ఒక చిన్నది రూమ్ లో నాలుగు మందులు డబ్బాలతో కూర్చుంటే సరిపోతుంది. అదే మెడికల్ షాప్, ఎవరైనా ప్రశ్నిస్తారని ముందే ఊహించిన మెడికల్ మాఫియా నెలకు 1500 రూపాయల చొప్పున అందించి ఒక డీఫార్మసీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీని లామినేషన్ చేసి మందుల డబ్బాలపై అతికిస్తే సరిపోతుంది, ఎవరు కూడా అడిగే పరిస్థితి ఉండదు. ఇంట్లో చిన్న పిల్లల నుండి మొదలుకొని పండు ముసలి వరకు అందరూ ఫార్మసిస్టులే, ఒక తెల్ల చిట్టి వస్తే సరిపోతుంది వారందరికీ తెలుసు చిట్టి వస్తే దేవుడు కరుణించినట్టే దాని తర్వాత ఒక తెల్ల సంచి అది కూడా ప్లాస్టిక్ రహిత, పేపర్ కవర్ ప్రజల ఆరోగ్యాలకు ప్లాస్టిక్ హానికరం కానీ ఏమీ తెలవని దొంగ ఫార్మసిస్టులు దొంగ మెడికల్ షాపులు మాత్రం సేఫ్ ఈ విధంగా ఆ తెల్ల కవర్ నిండిపోయి సుమారు 600 నుండి 800 వరకు బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలా వైద్య విద్య ఫార్మసీ డ్రగ్ పై ఎలాంటి అవగాహన కనీస పరిజ్ఞానం లేకుండా ఒక లక్ష రెండు లక్షల రూపాయల పెట్టుబడి తో ఉమ్మడి మండలమంతా కిరాణం కొట్టులకు మించిపోయి మెడికల్ షాపులు ఏర్పాటుచేసి మందులు విక్రయించడం జరుగుతుంది.

కాసుల మత్తులో డ్రగ్స్ అధికారులు, అక్రమ మెడికల్ నిర్వహణపై నేటికీ చర్యలు లేవు, అధికారులకు అయ్యప్ప గుడి అక్షింతలు.!?.

ఇక మహాదేవపూర్ మండలంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా కనీస ఫార్మసీ చట్టాలకు దోచుకోకుండా ఒకవైపు షాంపూల్ మెడిసిన్ మరోవైపు కంపెనీల పేరుతో జనరిక్ మందుల విక్రయాలు మెడికల్ అంటే ఏమిటో తెలవని వారు కూడా ఫార్మసిస్టులుగా మారిపోయి విచ్చలవిడిగా మందుల విక్రయాలు చేస్తుంటే జిల్లా డ్రెస్ అధికారులు మాత్రం న్నెత్తి చూడడం లేదు. డ్రగ్స్ అధికారులు మెడికల్ షాపులపై దాడులు చేయడం జరిగిందని మెడికల్ షాపుల్లో నిర్వహణ అనర్హులుగా ఉండి మందుల దుకాణం నిర్వహిస్తున్నారని మెడికల్ షాపులో అమ్మే మందులు నిషేధిత మందులను విక్రయిస్తున్నారని ఇలాంటి సందర్భాలు మహాదేవపూర్ ఉమ్మడి మండలం అలాగే మహదేవ్పూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో జిల్లా డ్రగ్ అండ్ ఫార్మసీ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, కేవలం ఒక యూనియన్ అధికారులకు మహదేవ్పూర్ మండల కేంద్రానికి ముందు ఒక అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అయ్యప్ప దేవుడి సాక్షిగా ఆ అధికారి ఆలయం వరకి పరిమితమై స్వామివారిని దర్శించుకుని అక్షింతలు తీసుకొని వెళ్లిపోవడం జరుగుతుందని విశ్వనీయ సమాచారం, అయ్యప్ప స్వామి అక్షింతలు తీసుకున్న ఆ అధికారులు ఉమ్మడి మండలంలో మెడికల్ షాపుల నిర్వహణపై ఇలా చర్యలు తీసుకుంటారు స్వామివారికి కోపం వస్తుందని అక్షింతలతో సంతోషంగా వెళ్లిపోవడం జరుగుతుందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *