Jail for Drunk Driving
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష
దామెర,నేటిధాత్రి
దామెర పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఈరెల్లి రమేష్ మద్యం సేవించి వాహనం నడిపినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.దామెర ఎస్ఐ కొంక అశోక్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది.ఈ నేపథ్యంలో గురువారం అతనిని కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జేఎఫ్సీఎం-సెంకడ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శ్రీవల్లి శైలజ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం 15 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు 1000రూపాయల జరిమానా విధించారు.మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.aa
