Retired Employees Call for Massive Dharna at Indira Park
ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాను విజయవంతం చేయండి
సంకా బద్రినారాయణ
జిల్లా అధ్యక్షులు( రేవా)
మహబూబాబాద్/ నేటి ధాత్రి
విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం మహబూబాబాద్ లో రేవాజిల్లా అధ్యక్షులు సంకా. బద్రి నారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించినది ఈ సమావేశాన్ని ఉద్దేశించి సంకా.బద్రి నారాయణ, గౌరవ అధ్యక్షులు సోమ .గోవర్ధన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 18 నాడు ధర్నా చౌక్,ఇందిరా పార్కు వద్ద జరిగే మహా
ధర్నా విజయవంతం చేయాలని అన్నారు. ఈ ధర్నాకు రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయుటకు సహకరించాలని కోరినారు.ఇప్పటికీ 66 మంది మరణించడం బాధాకరం అదేవిధంగా సోమవారం మరణించిన వెంకటేశ్వర నాయక్ జూనియర్ లెక్చరర్ కి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించనైనది అనంతరం మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెల్లించవలసిన బకాయిలు ఇప్పటివరకు చెల్లించకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులతో, మానసిక వేదనతో వైద్య ఖర్చులు అందక మరణించినారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రిటైర్డ్ అయినా వారికి వెంటనే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినారు, అయినా ఇప్పటివరకు మాకు రావలసిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మేం దాచుకున్న మా డబ్బులను ఇతర కార్యక్రమాలకు వినియోగించడం రిటైర్డ్ ఉద్యోగులను, ఉపాధ్యాయులను వంచించడమే అవుతుంది అనారోగ్య కారణాలతో, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని సాకడం చాలా కష్టతరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కానీ ఈ రాతిగుండె ప్రభుత్వం మన సమస్య పట్ల పట్టనట్లు వ్యవహరిస్తుంది,ఇకమీదట ఎవరు కూడా మరణించ కుండ చూడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఈ సమావేశంలో గుదే.చంద్రమౌళి, రావుల నిరంజన్ రెడ్డి, సుంకరి వెంకటేశ్వర్లు, కోల.దర్గయ్య, మైసయ్య, గరికపాటి వెంకటేశ్వర్లు, బైరి.జనార్ధన్, ప్రవీణ్ కుమార్ పి. విజయ్ కుమార్ మొదలవారు పాల్గొన్నారు.
