మహబూబాద్ ఎంపీ స్థానాన్ని ఆదివాసీలకు నియమించాలి

తుడుం దెబ్బ పొల్యూటీబ్యూరో డిమాండ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
2024 నా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాద్ పార్లమెంటు స్థానంలో అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసులకి టికెట్ కేటాయించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పోలిటి బూర్యో సభ్యులు
కోడెం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.గతంలో భద్రాచలం పార్లమెంటుని ఆదివాసి ఎంపీలుగా ఎన్నికైన దుంప మేరీ విజయ్, కర్రెద్దుల కమల కుమారి, సోడా రామయ్య,మీడియం బాబురావు సభ్యులుగా ఎన్నికైన ఆ ప్రాంత అభివృద్ధికి అక్కడున్న ఆదివాసులకి అండదండగా నిలిచి పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ముందుండి నడిపించినటువంటి త్రాగునీరు సాగునీరు మౌలిక అభివృద్ధిని చూసి గిరిజనేతర్ల రాజకీయ కబంధహస్తాల్లో తీసుకొని కుట్రలు కుతంత్రతో ఆదివాసీల మనుగడ లేకుండా చేసిన రాజకీయాల కుట్రలో భాగంగా డిలిమిటేషన్ పేరుతో మహబూబాద్ పార్లమెంట్ నీ 2009 నుండి ఏర్పడిన నుండి అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ సుమారు 6 లక్షల జనాభున్న మహబూబాబాద్ ఆదివాసీల్ని గుర్తించకుండా టికెట్ కేటాయించకుండా పార్లమెంటులో ఒక లంబాడి తెగ టిక్కెట్ ఇవ్వటాన్ని తుడుం దెబ్బ తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు లంబాడి జనాభా 3 లక్షల మాత్రమే అని వారన్నారు. ఇది ఎంత మాత్రానికి తగదని ఈసారి ఎన్నికల్లో ఆదివాసీలను గుర్తించి ఆదివాసి టికెట్ కేటాయించాలని ఆదివాసి తెగలపైన ఏమాత్రం కనికరం లేనటువంటి ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని వారు అన్నారు. ఇప్పటికైనా ఆదివాసి తెగకు మాత్రమే గుర్తింపు నివ్వాలని రాజకీయ పార్టీలు ఆదివాసి 9 తెగల వారికే టికెట్ కేటాయించాలని కేటాయించలేని పరిస్థితిలో ఆదివాసులు అర్థం చేసుకోవాలని అట్టి పరిస్థితులు ఈసారి జరగబోయే పార్లమెంట్ స్థానాలకి ఈ విధ రాజకీయ పార్టీలు ఆదివాసి తెగలకే ఇవ్వాలని లేని పక్షాన ఏ రాజకీయ పార్టీల అయినా ఆదివాసి టికెట్ కేటాయిస్తే ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరుతున్నాం అని రాజకీయ పార్టీల్లో ఉన్న ఆదివాసి కార్యకర్త నుండి రాష్ట్ర నాయకులు వరకు అందరూ కలిసిగ ఆదివాసి అభ్యర్థిని గెలిపించుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్,
బిఆర్ఎస్, బిజెపి,సిపిఐ,సిపిఎం న్యూ డెమోక్రసీ, ప్రజాపంద తదితర పార్టీలో ఉన్న ఆదివాసిలు జాతి పక్షాన నిలవాలని ఆయన కోరారు. ఆదివాసి అభ్యర్థిని పార్లమెంటుకి మన గలాన్ని వినిపించాలంటే ఆదివాసి అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డిమాండ్ చేస్తున్నమన్నారు.అలాగే వివిధ రాజకీయాల్లో ఉన్న ఆదివాసి కార్యకర్తలకి నాయకుల ను అందర్నీ కోరుచున్నాము లేని పక్షాన ఆదివాసి ప్రజలు రాజకీయ పార్టీలను గ్రామాలకు రాకుండా బహిష్కరించాలని డిమాండ్ చేస్తమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *