Mancherial to Celebrate Labour Day with Grandeur
కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మే 1వ తేదీన జిల్లాలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో మే 1వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న వేడుకలకు కార్మికులు,అధికారులు,ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జిల్లాలోని మండలాలలో జరిగే వివిధ కార్యక్రమాలను ప్రజలు,కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
