బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు ఎంపికైన కుమారస్వామి
భూపాలపల్లి నేటిధాత్రి
బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు – 2025 సంవత్సరమునకు గాను కాళేశ్వరం దేవస్థానం సరస్వతి పుష్కరాల ఉత్సవ కమిటీ మెంబర్ గా ఎల్ ఐసి ఏజెంట్ గా పలు సేవా కార్యక్రమాలు చేసిన దానికి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మంజూరు నగర్ బీసీ కాలనీ కి చెందిన ఓదెల కుమారస్వామి ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. ఈ అవార్డు నేషనల్ కమిటీ నేషనల్ చైర్మన్ బీఎస్ఎ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయములో అందజేశారు
ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు అవార్డులను వచ్చే నెల సెప్టెంబర్ 5 న తిరుపతి లోని గంధమనేని శివయ్య మెమోరియల్ ట్రస్టు కమ్యూనిటీ హాల్ లో అందజేయనున్నట్లు తెలియజేశారు.
ఈఅవార్డు లెటర్ అందజేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ , హనుమాoడ్ల విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ నెంబర్ వంగ కుమార స్వామి, కనుకుంట్ల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
