రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కర్ర అనిల్ కుమార్ రెడ్డి తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లు రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఎలిమినేటి సుమన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా కర్ర అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘాల ఐక్యవేదిక భవిష్యత్తులో చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకొని కుల బంధువుల కోసం తన బాధ్యతను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికైన అనిల్ కుమార్ రెడ్డిని రెడ్డి సంఘాల నాయకులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.