నర్సంపేట,నేటిధాత్రి:
రాబోయే గ్రామీణ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో
నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి యువత సోషల్ మీడియాలో వినూత్న ఆలోచనకు తెర తీసింది.తమ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వారే రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయాలని, వారికి పూర్తి మద్దతు ఉంటుందని గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది.
గ్రామ అభివృద్ధికి సంబంధించిన తాజా ప్రతిపాదనలో యువతకు కీలక పాత్ర ఇచ్చేందుకు సర్పంచ్ పదవిలో ఉన్న నేతలు కొత్త విధానాన్ని ప్రకటించారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ వేదికగా వినూత్న ఆలోచనలు పంచుకోవాలని యువతను ప్రోత్సహిస్తున్నారు.ఈ మేరకు, సర్పంచ్ పదవిలో ఉన్న వారు, గ్రామ సమస్యలను పరిష్కరించడంలో పాల్గొన్న, వాట్సాప్ ద్వారా యువతా సూచనలను, ఆలోచనలను అమలు చేసిన వారికి సర్పంచ్ పదవి కట్టబెట్టే ప్రతిపాదనను ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.ఈ కొత్త ఆలోచన ద్వారా గ్రామ అభివృద్ధికి యువత అనుసరించే సృజనాత్మక మార్గాలను మరింత మెరుగుపరచేందుకు ఆవకశం కల్పించాలని ఆశిస్తున్నారు.