మంచిర్యాల నేటిదాత్రి
మంచిర్యాల శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 26 నెలలు గడుస్తున్న యాజమాన్యం కార్మికుల రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో శాలివాహన పవర్ ప్లాంట్ స్టాప్ అండ్ వర్కర్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేయడానికి పూనుకోవడం జరిగింది. కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించే వరకు కంపెనీకి సంబంధించిన భూములను ఎవరు కొనవద్దని రియల్ ఎస్టేట్ వ్యాపారులను కోరుచున్నాము. అదేవిధంగా శాలివాహన పవర్ ప్లాంట్ యజమాని మల్కా కొమురయ్య స్పందించి ఈనెల చివరి వరకు కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి.లేని పక్షంలో కంపెనీకి సంబంధించిన భూములలో గుడిసెలు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము..
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్, ప్రధాన కార్యదర్శి నిమ్మరాజుల సత్యం, ఉపాధ్యక్షులు సగ్గుర్తి ఆనందరావు, కోశాధికారి పెంట సత్యం,వూడెం రవిశంకర్, ఆసరి రాజయ్య, సిరిపురం తిరుపతి, కాయితి బుచ్చయ్య, మానెం శ్రీశైలం, అరికిల్ల శ్రీనివాస్, మైదం సత్యనారాయణ,గెల్లు ఎల్లయ్య, మరియు కార్మికులు పాల్గొన్నారు