Municipal Officials Invited for Hindu Dharma Sammelan
హిందూ ధర్మ సమ్మేళనానికి మున్సిపల్ చైర్మన్,కమిషనర్‌కు ఆహ్వానం
పరకాల,నేటి దాత్రి
ఈనెల 28న పరకాల పట్టణంలో నిర్వహించనున్న హిందూ ధర్మ సమ్మేళనానికి మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్,మున్సిపల్ కమిషనర్ అంజయ్యలను హిందూ ధర్మసమ్మేళన సమితి సభ్యులుమర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు సమ్మేళనం లక్ష్యాలను వివరించి,హిందూ సంప్రదాయాలు,ఆధ్యాత్మిక విలువలను ప్రజల్లో ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమం విజయవంతానికి మున్సిపల్ యంత్రాంగం సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ సమ్మేళన సమితి అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వర రావు,గౌరవ అధ్యక్షులు డాక్టర్.నాగబండి విద్యాసాగర్,ఉపాధ్యక్షులు పాపిరెడ్డి పల్నాటి సతీష్,మామిడి రమేష్ పాల్గొన్నారు.
