హోం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి.
మహబూబ్ నగర్ నేటి ధాత్రి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. ఏఐసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో మంగళవారం భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగింది. నడుచుకుంటూ ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా.. ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా ను వెంటనే బర్తరఫ్ చేయాలని, దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకు ఎమ్మెల్యేలు , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మెమోరండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ఆలి,ఏర్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.