Kavitha Distributes Cricket Kits
ఇంటి బయట నిర్లక్ష్యం చేస్తే ముప్పే..
దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లపై వరంగల్ పోలీసుల హెచ్చరిక
*వేసవిలో ఖాళీ ఇళ్లపై నేరగాళ్ల కన్ను
అప్రమత్తంగా ఉండాలి*
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచనలు*
నర్సంపేట,నేటిధాత్రి:
వేసవి సెలవుల సమయంలో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి బయటకు వెళ్లే సందర్భాలు ఎక్కువగా ఉండటంతో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, వాహన చోరీలు పెరిగే అవకాశముందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. “ఇంటి బయట నిర్లిస్తున్నారా? జర భద్రం” పేరుతో ప్రజలకు పలు భద్రతా సూచనలు జారీ చేశారు.
ఇంటి తలుపులు, కిటికీలు, గేట్లకు తప్పనిసరిగా తాళాలు వేయాలని, ద్విచక్ర వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేసి లాక్ చేయాలని సూచించారు. బంగారు ఆభరణాలు ధరించి బయట తిరగవద్దని, విలువైన నగదు, వస్తువులను ఇంట్లో నిర్లక్ష్యంగా ఉంచొద్దని తెలిపారు. రాత్రివేళ అపరిచితులకు ఆశ్రయం ఇవ్వకూడదని, మహిళలు, వృద్ధులు ఒంటరిగా బయట నిర్లించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, తగినంత లైటింగ్ కల్పించడం మంచిదని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పొరుగువారితో సమన్వయం చేసుకుని రాత్రి వేళల్లో పరస్పరం నిఘా ఉంచుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేరనే సమాచారాన్ని పోస్టు చేయవద్దని హెచ్చరించారు.

ఉదయం సమయంలో ఇంటి ముందు ఊడ్చుకుంటున్న మహిళలు లేదా వాకింగ్‌కు వెళ్లే మహిళల మెడల్లోని బంగారు గొలుసులను మోటార్‌సైకిళ్లపై వచ్చే దుండగులు లాక్కెళుతున్న ఘటనలు జరుగుతున్నాయని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచ%B
