Allu Arjun’s ₹16 Lakh Luxury Move
ఇంటి అద్దె 16 లక్షలు
బన్నీ ‘బిలియనీర్’ లైఫ్ స్టైల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు లోకల్ కాదు, గ్లోబల్ స్టార్! ‘పుష్ప’తో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించిన బన్నీ, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హార్ట్ బీట్ ముంబయిపై కన్నేశాడు. అల్లు అర్జున్ ముంబయికి షిఫ్ట్ అవుతున్నాడన్న వార్త గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అయితే ఆయన అక్కడే శాశ్వతంగా సెటిల్ అయిపోతారా? అన్న సందేహాలకు అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం తాత్కాలికమేనని స్పష్టం చేశారు. మరి ఆ తాత్కాలిక నివాసం రేంజ్ ఎలా ఉందో తెలుసా?
ముంబయిలోని మోస్ట్ పాష్ ఏరియా.. జుహూ! బాలీవుడ్ బడా స్టార్లు కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, పవర్ కపుల్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వంటి సెలబ్రిటీలు నివసించే రిచ్ ఏరియా అది. అక్కడే సముద్రం ఎదురుగా ఉండే ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను బన్నీ లీజుకు తీసుకున్నాడు.. 6 వేల చదరపు అడుగుల వైశాల్యం.. కళ్లు చెదిరే 5 బెడ్ రూమ్స్.. పర్సనల్ ప్లంజ్ పూల్.. వీటికి తోడు నాలుగు లగ్జరీ కార్ల పార్కింగ్. ఈ అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ కోసం అల్లు అర్జున్ చెల్లిస్తున్న అద్దె వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మూడేళ్ళకు అక్షరాలా 16 లక్షల రూపాయలు!
అయితే ఇక్కడే అసలు చర్చ మొదలైంది. కేవలం తాత్కాలిక మకాం అన్న అరవింద్ గారి మాటలకు, ఈ మూడేళ్ల లీజుకు లింక్ ఎక్కడ? ఇక్కడే బన్నీ ‘లాంగ్ టర్మ్ ప్లాన్’ కనిపిస్తోంది. అట్లీతో చేయబోయే సినిమాతో పాటు, లోకేశ్ కనగరాజ్‌తో ప్లాన్ చేసిన భారీ ప్రాజెక్టును కూడా ముంబయి బ్యాక్ డ్రాప్లోనే పట్టాలెక్కించబోతున్నారట. బాలీవుడ్ మార్కెట్‌ను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే, అక్కడే మకాం వేయడం కరెక్ట్ అని బన్నీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ, విక్కీ కౌశల్ వంటి బిగ్ సెలబ్రిటీల పక్కన.. ఇప్పుడు స్టైలిష్ స్టార్ తన నయా అడ్రస్ సెట్ చేసుకున్నాడు. మొత్తానికి టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ కోటలో పాగా వేస్తున్న ఐకాన్ స్టార్.. రాబోయే మూడేళ్లు హిందీ బెల్ట్‌ను తన సినిమాలతో ఎలా షేక్ చేస్తాడో చూడాలి!
