Hindu Sammelan Preparations in Ramakrishnapur
హిందూ సమ్మేళన కార్యక్రమ వాల్ పోస్టర్ విడుదల…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడి శాంఖరీ గార్డెన్ లో ఈ నెల 18 న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమ్మేళన అధ్యక్ష, ప్రధాన కారుదర్శులు పత్తి శ్రీనివాస్, బండారి వేణుగోపాల్ తెలిపారు. శాంఖరీ గార్డెన్ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సమ్మేళనంకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేసి వారు మాట్లాడారు. దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటే హిందువులందరు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. హిందూధర్మం, సంస్కృతి, నేటి తరానికి తెలుపడం కోసం, ఈ సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాగ్వశ్వర్ రావు, రవికుమార్, నగేష్, కృష్ణ భాస్కర్, రమేష్, మహేందర్ పాల్గొన్నారు.
