జీవన్ లాల్ పుట్టిన రోజున రక్తదానం చేసిన అభిమానులు
ఆజ్మీర వీరన్న.
కారేపల్లి నేటి ధాత్రి
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రల ఇన్కమ్ టాక్స్ కమిషనర్ వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ఝ తనయుడు లావుడియా జీవన్ లాల్ మంచి మనసున్న మహారాజని జీవన్ లాల్ యువ సేన నాయకులు అజ్మీరా వీరన్న అన్నారు.కారేపల్లి మండల కేంద్రంలోని జీవన్ లాల్ పుట్టినరోజు వేడుకలు సోమవారం వారి అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తమ నాయకుడు లావుడియా జీవన్ లాల్ మార్గంలో ప్రజాసేవే పరమావధిగా సమాజ శ్రేయస్సు కోసం తమ నాయకుడి మాటలో తలసేమియా వ్యాధి బాధితులు అవసరంలో రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నా విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో వారి అభిమానులు అజ్మీర వీరన్న మూడ్ మోహన్ బత్తుల శ్రీనివాస్ వాంకుడొత్ నరేష్ భూక్య రాంకిషోర్ నాయక్ గుగులోత్ హారు బాణోత్ మంగిలాల్ నాయక్ భూక్య రాంకి వాంకుడొత్ కరణ్ సింగ్ బాణోత్ హనుమ పప్పుల నిర్మల భూక్య చాందని అంగోత్ మాతృ బాణోత్ చక్రం సింగర్ నాగేంద్ర బాబు వాంకుడొత్ విజయ్ ధరవత్ హిరలాల్ అంగోత్ కుమార్ జగన్ తక్కెళ్లపల్లి శ్రీను పాల్గొన్నారు.