Hanuman Shobha Yatra Preparations Begin
హనుమాన్ శోభాయాత్ర కరపత్రం ఆవిష్కరణ
మంగపేట, నేటిధాత్రి:
మంగపేట మండలం కమలాపురంలో హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి సన్నాహాలు జోరుగాసాగుతున్నాయి.హనుమాన్ దేవాలయంలో హనుమాన్ భక్తులు హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గురువారం హనుమాన్ శోభాయాత్రకు హిందూ బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యి శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుభయాత్ర దాత హైదరాబాద్ కు చెందిన వెంకట చిన్నయ్య చారి అని తెలిపారు.కమలాపురం లోని భక్తంజనేయ దేవాలయం నుండి సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో లింగంపల్లి శ్రీనివాసరావు,కటికనేని ప్రఫుల్, యాస నాగేందర్ రెడ్డి,దాసరి మోహన్, నూకల రాజేష్,తుక్కాని ఉమేష్, పవన్, బొగ్గుల కుషులు,రామరాజు, వేణు, అశోక్,నారాయణ, సంపత్, శ్రీహరి మొదలగు స్వాములు పాల్గొన్నారు.
