ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లో కూడలి వద్ద భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత ప్రజానా యకుడు,మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు జరుపు కున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో
కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మా ట్లాడుతూ మాజీ శాసనస భ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్ర మంలో బీఆర్ ఎస్ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, ఉపా ధ్యక్షులు, ప్రధానకార్యదర్శు లు కోశాధికారులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్య కర్తలు, మహిళా కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొ న్నారు.
