Free Medical Camp in Kankur
కాన్కూర్ లో ఉచిత వైద్య శిబిరం
జైపూర్,నేటి ధాత్రి:
మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా రోగులకు నిపుణులైన వైద్యులు సేవలందించారు.అవసరమైన వారికి షుగర్,బీపీ,ఈసీజీ పరీక్షలు నిర్వహించి తక్షణ రోగ నిర్ధారణ చేశారు.అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.పండుగలు,సెలవులు అనే తేడా లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.అవసరమైతే రోగులను కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి ఆధునిక వైద్యం అందిస్తామని తెలిపారు.గ్రామ సర్పంచ్ కొయ్యడ సాగరిక,ఉపసర్పంచ్ పున్నం చందు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ శిబిరంలో మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్,అబ్దుల్ వకీల్,శ్రీకాంత్, సిద్దు,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
