రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామాయంపేట పట్టణంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షలు రాస్తున్న ఐదుగురు డిగ్రీ విద్యార్థులు డిబర్ కావడం రామాయంపేటలో ఆందోళనలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజు పలు ప్రాంతాలకు చెందిన 246 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాగా ఎగ్జామ్ అడ్వైజర్ గా వచ్చిన స్క్వాడ్ విద్యార్థులను పట్టుకొని కాపీ చేస్తున్నారని ఐదుగురిని డిబార్ చేశారు.ఎగ్జామ్ అడ్వైజర్ ఏ కళాశాలలో పనిచేయకపోయినా యూనివర్సిటీ నుంచి లెటర్ తెచ్చుకుని విధులు నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.దీంతో కళాశాల ఎదుట విద్యార్థులు అందరూ కలసి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట పోలీసులు డిగ్రీ కళాశాల వద్దకు వెళ్లి విద్యార్థులను సముదాయించి పంపించారు.