మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని తీగలపల్లి గ్రామానికి చెందిన సాకలి. బాలకృష్ణమ్మ అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన నెత్తికోపుల ఆశన్న వారి కుటుంబం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి అంతక్రియల ఖర్చుల నిమిత్తం 4000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.