‘ఈటెల’కు పీఎల తలనొప్పి…? ఈటెలను వదలనంటున్న పీఎలు?

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రస్తుతం పీఎల తలనొప్పితో గందరగోళానికి గురి అవుతున్నట్లు తెలిసింది. గతంలో మంత్రికి సన్నిహితంగా ఉన్నవారు, పీఎలుగా కొనసాగిన వారు ఉద్యోగం ఖాళీగా లేదు. ప్రస్తుతం తనకు పీఎల అవసరం ఎంతమాత్రం లేదన్న వినడం లేదట. వద్దుమొర్రో అని చెప్పిన మంత్రి పేషీ చూట్టే తిరుగుతూ పీఎలుగా పనిచేస్తాం అంటూ జబర్థస్తీ చేస్తున్నట్లు తెలిసింది. రెండోసారి అధికారంలోకి వచ్చి పాలన పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రులు, ఇతరులకు పీఎల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పీఎలు, ఓఎస్డీల విషయంలో తానే స్వయంగా వారిని నియమిస్తానని, ఎవరి ఇష్టాలకు వారు నియమించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఆ పనిని చేసి చూపించారు. కానీ సీఎం అంతగా ఆదేశించిన ప్రైవేట్‌ పీఎల విషయంలో మంత్రుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఒక్కో మంత్రి అవసరం ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చినట్లుగా ఎంతమందిని అంటే అంత మందిని పీఎలుగా నియమించుకుంటున్నారు. దీని మూలంగా ప్రజల్లో, నాయకులు, కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

ఈటెలను వదలనంటున్న పీఎలు

టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత ఈటెల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. అప్పుడు కొంతమందిని పీఎలుగా నియమించుకున్నారు. అయితే ఈ పీఎల్లో ఓ ఇద్దరు పీఎలు ఆర్థిక అరాచకత్వాకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మీడియా నుంచి బయటకు వచ్చి ఈటెల పీఎగా కొనసాగిన వ్యక్తి ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బుతో అదృశ్యమయ్యాడని తెలిసింది. ఈటెల పదేపదే ప్రశ్నించిన సమాధానం చెప్పకుండా దాటవేసి మొహం చాటేసినట్లు సమాచారం. అయితే రెండోసారి టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఈటెల తిరిగి మంత్రి కావడంతో పీఎగా కొనసాగుతానని ఈటెలను బ్రతిమిలాడగా అవసరం లేదని చెప్పినా వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చూసుకుంటానని చెప్పి తిరిగి విధుల్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. సెటిల్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ నిర్వహించేందుకు ఈ పీఎ ఈటెలను ఒప్పించి హైదరాబాద్‌లోని జివికె మాల్‌ వెనకాల రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి ఓ కార్పొరేట్‌ కార్యాలయాన్ని తెరిచినట్లు తెలిసింది. ఇదే పీఎ గతంలో తన సొంత మీడియా సంస్థ పేరుతో ఆర్థికశాఖ నుంచి ప్రకటనల రూపంలో లక్షల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే వ్యక్తిగత వ్యవహారాలు, ఆర్థిక వనరుల విషయంలో తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పడం వల్లే ఈటెల ఈ మాజీ మీడియా జర్నలిస్టు, ప్రస్తుత పీఎకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

అప్‌ అండ్‌ డౌన్‌ పీఎ

ప్రస్తుతం మంత్రి ఈటెల వద్ద అప్‌ అండ్‌ డౌన్‌ పీఎ సైతం తన సెటిల్‌మెంట్ల ప్రతాపాన్ని చూపుతున్నట్లు తెలిసింది. అసలు పీఎ కాకున్న, మంత్రి పీఎగా ఒప్పుకోకపోయిన ఇతగాడు నిత్యం కరీంనగర్‌ నుండి హైదరాబాద్‌ సెక్రటేరియట్‌కు తిరుగుతూ పైరవీల పనులు చక్కబెడుతున్నట్లు తెలిసింది. మంత్రికే తెలియకుండా తాను పీఎనని అధికారులను పరిచయం చేసుకుని పనులన్నీ చేసుకుంటున్నట్లు తెలిసింది. టోకెన్‌ క్లియరెన్స్‌, బదిలీలు, ప్రమోషన్లు, సీఎం రిలీప్‌ఫండ్స్‌, ఎల్‌ఓసి, పనులు లేకుండా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి పేషీలో పనిచేసిన అధికారులను మచ్చిక చేసుకుని మెడికల్‌ సీట్లు సైతం ఇప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్న ఈ విషయాలేవి మంత్రి ఈటెల దృష్టికి రాకపోవడం గమనార్హం.

పొమ్మంటే…పోరు

ఈటెల వద్ద గతంలో పీఎలుగా పనిచేసిన వారు అవసరం లేదు అంటే కూడా వినడం లేదంటే. ఎందుకు అంతలా పీఎ పోస్టునే పట్టుకు వేలాడుతున్నారో అద్దం కావడం లేదు. ఈటెల సైతం వీరి విషయంలో సానుకూలంగా వ్యవహారించడం, అవసరం లేదని చెపితే ఏం జరుగుతుందోనని ఆలోచించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మంత్రికి సంబంధించిన కొన్ని రహాస్యాలు వీరి వద్ద ఉండడం వల్లే మంత్రి వీరి విషయంలో సీరియస్‌గా ఉండలేకపోతున్నారే ప్రచారం జోరుగానే కొనసాగుతుంది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *