ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి
– ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఇద్దరు వద్ధులపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా దాడి చేశారు. దీంతో ఒక వద్ధుడు మతి, మరో వద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను తొందరలోనే పట్టుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.