
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూనియన్, అనుబంధం బి ఎం ఎస్ ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేంద్ర కార్మిక శాఖ నుండి నియమించబడిన కాంట్రాక్ట్ కార్మికుల బోర్డు చైర్మన్ సురేంద్ర కుమార్ పాండే మరియు అధ్యక్షులు యాదగిరి సత్తయ్య స్టాండర్డ్ డైజేషన్ కమిటీ సభ్యులు ఈరోజు జైపూర్ పవర్ ప్లాంటు లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పై జీతభత్యాలు చెల్లింపుల గురించి అలవెన్సులు క్యాంటీన్ సదుపాయాలు ఉద్యోగ సామాజిక భద్రత కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పైన యాజమాన్యం ప్రతినిధి ఈడి పి.చిన్న బస్వి రెడ్డి జనరల్ మేనేజర్ మరియు సింగరేణి అధికారులతో కాంట్రాక్టు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాంటును సందర్శించి అనేక విషయాల పైన మౌలిక సదుపాయాల పైన చర్చించినారు. తదుపరి పర్యటనలో కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని యాజమాన్యంతో చర్చించారు. అన్ని సక్రమంగా వస్తున్నాయా లేదా అని సమావేశం ఏర్పాటు చేయడం వారికి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి కొన్ని కొన్ని విషయాలలో నిబంధనల ప్రకారం ప్రకారం చేయడం లేదు. అని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేసే కార్మికులలో డస్ట్ కు సంబంధించిన గాని అలవెన్సులు గాని శబ్దానికి సంబంధించిన అలాగే సబ్సిడీతో కూడినటువంటి క్యాంటీన్ విషయంలో గానీ పూర్తిగా అలసత్వ ధోరణిలో ఉన్నారని వారి దృష్టికి రావడం జరిగింది. ఇట్టి విషయాలపై మరో 15 రోజులలో వివరణ ఇవ్వాలని శ్రీ సురేంద్ర కుమార్ పాండే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ప్రొటెక్షన్ యూనియన్ సంఘం ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ తొగరి కృష్ణ, ఉపాధ్యక్షులు చిలుకాని వెంకటేశ్వర్లు, పాత శివ కృష్ణ, మద్దూరి రాజు యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈగ సురేందర్,బోడకుంట శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ అట్ల సుమన్ , అట్ల అంజి రెడ్డి, కళ్యాణపు సతీష్,కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.