సీసగిలాసతో కమలం వికాసమా?

`పవన్ వస్తే గాని బీజేపీని గెలిపించుకోలేరా?

`తెలంగాణ బీజేపీలో లీడర్లు లేరా?

`ఏ పి నాయకుడు పవన్ కళ్యాణ్ వస్తే గాని గెలవలేరా?

`తెలంగాణా బీజేపీ నాయకులకు వారి మీద వారికే నమ్మకం లేదా?

`పవన్ కళ్యాణ్ వస్తే తప్ప పార్టీ నిలబడదా?

`పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే తప్ప ఒట్లు రావా?

`పొరుగు రాష్ట్ర నాయకుడు గెలిపిస్తే గెలిచే వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారా?

`ఆంధ్రా నాయకులకు ఇంకా ఊడిగం చేస్తారా?

`మళ్ళీ ఆంధ్ర నాయకులను తెచ్చి తెలంగాణ ను తెర్లు చేస్తారా?

`ఏపీ లో ఒంటరిగా పోటీ చేసి గెలవలేని నాయకుడు పవన్ కళ్యాణ్?

`కూటమి కట్టితే గాని గెలవలేని పవన్ కళ్యాణ్ బీజేపీని గెలిపిస్తాడా?

`మేమిద్దరం చాలు అని ఇద్దరు బీజేపీ నాయకులు మాట్లాడి నాలుగు రోజులు కాలేదు?

`ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు ల మాటలు ఒట్టివేనా?

`తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు 11రోజులు అన్నం తినలేదన్న పవన్ తో ప్రచారమా?

`తెలంగాణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపితే ప్రజలు ఊరుకుంటారా?

`తాజాగా కోనసీమకు తెలంగాణా దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలు మర్చిపోయారా?

`తెలంగాణ ప్రజలు అంత అమాయకులనుకుంటున్నారా?

`పార్లమెంట్ ఎన్నికలలో 8 మంది ఎంపి లను గెలిపించారు?

`ప్రధాని మోడీ పేరు చెప్పితే చాలదా?

`తెలంగాణ బీజేపీ నాయకుల మాటలు తెలంగాణా ప్రజలు నమ్మరా?

`బీజేపీని నమ్మించడానికి పవన్ కళ్యాణ్ రావాలా?

`తెలంగాణ బీజేపీ నేతలంతా అసమర్థులని తిట్టించుకోవాలని ఉందా?

`తెలంగాణ బీజేపీ లో పోరాట యోధులు లేరా?

`ఏపీలో బలం లేని నాయకుడు తెలంగాణకు బలమౌతాడా?

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 రాజకీయాలలో అప్ప్పుడప్ప్పుడు కొన్ని విచిత్రమైన వార్తలు వినాల్సి వస్తుంది. ఆ వార్తలు విని తేరుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంతలా ఆశ్యర్యపోయే వార్తలు మోసుకురావడం రాజకీయ పార్టీలకే చెల్లుతుంది. అందులో తాజాగా వార్త. తెలంగాణలో బిజేపి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏపి డిప్యూటీ సిఎం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం? అవాక్కయ్యారా! కాని ఇది నిజం. మారి హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశమా? లేక తెలగాణ రాష్ట్ర బిజేపి నాయకులు తీసుకున్న నిర్ణయమో గాని, ఆ వార్త నిజం. తెలంగాణ బిజేపి నాయకులు చెప్పిన మాట వాస్తవం. తెలంగాణ రాజకీయాలల్లో కమలం వికసించాలంటే సీసగిలాసతోనే సాధ్యమౌతుందని నాయకులు నమ్ముతున్నట్లున్నారు. అందుకే పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. అప్ప్పుడే తెలంగాణ ప్రజల్లో ఆలోచనలు మొదలయ్యాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపిలను గెల్చుకున్న పార్టీ బిజేపి. అప్ప్పుడు ఏ జాతీయ నాయకుడు వచ్చి ప్రచారం చేసిందిలేదు. ఒక్క ప్రధాని మోడీ బొమ్మ సరిపోయింది. ప్రధాని మోడీని మూడోసారి పదవిలో కూర్చోబెట్టాలి. ఈసారి నాలుగువందల సీట్లు బిజేపికి రావాలి అనే నినాదం బలంగా పనిచేసింది. తెలంగాణలో బిజేపి ఎనమిది మంది ఎంపిలను గెల్చుకున్నది. ఒక వేళ బిజేపి పార్టీ నాయకులను చూసి గెలిపించారనుకున్నా ఒక అర్దముంది. కాని మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం ఏమిటి? అనే ప్రశ్న మొదలైంది. తెలంగానలో బిజేపిని నడిపించే నాయకుడే లేడా? తెలంగాణలో బిజేపికి ఓట్లు వేయించే శక్తి వున్న నాయకులే లేరా? ఎనమిది మంది ఎంపిలు, ఎనమిది మంది ఎమ్మెల్యేలు, మగ్గురు ఎంఎల్‌సిలు బలం సరిపోదా? వారికి ఏపి డిప్యూటీ సిఎం. పవన్ వచ్చి ప్రచారం చేస్తే గాని మున్సిపాలిటీలు గెల్చుకోలేరా? ఏపిలో బిజేపితో కలిస్తే తప్ప గెలుపు ముఖం చూడని పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో బిజేపికి హీరోను చేస్తారా? పవన్ లేకపోతే బిజేపి గెలవలేదన్న మాటలకు ఊతం కల్పిస్తారా? తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసమున్నాను. అన్నం తినాలనిపించలేదు. అని అనేక వేధికల మీద తెలంగాణ మీద తన అక్కసును వెల్లగక్కిన పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయిస్తే మున్సిపాలిటీలు గెలుస్తారా? తాజాగా కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాన్‌ను తెచ్చి ప్రచారం సాగిస్తారా? పవన్ వస్తే జనం వస్తారేమో కాని, ఓట్లు పడతాయా? ఏపి రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవలేని నాయకుడు పవన్ కళ్యాణ్. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు గెల్చుకున్న పార్టీ. ఆ పార్టీ అదినేతగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్క చోట కూడా గెలవలేదు. 2024 ఎన్నికల్లో మళ్లీ కూటమితో జత కడితే తప్ప స్వయంగా పవనే గెలవలేదు. ఆ ఎన్నికల్లో ఇరవై సీట్లు ఇస్తే తీసుకున్న పవన్ కల్యాణ్ తెలంగాణలో బిజేపిని గట్టెక్కిస్తారా? తెలంగాణలో అనేక ఎన్నికల్లో విజయాలు సాదించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీని గెలిపించే శక్తి లేదని ఒప్ప్పుకున్నట్లేనా? గతంలో బిజేపి అద్యక్షుడుగా పనిచేసి, పార్టీకి ఊపు తెచ్చిన నాయకుడుగా కీర్తింపబడిన మరో కేంద్ర మంత్రి బండిసంజయ్ వల్ల కూడా కాదని తేల్చుకున్నారా? పవన్ వస్తే గాని నాలుగు సీట్లు సంపాదించుకోలేమని నిర్ణయం తీసుకున్నారా? ఓ వైపు తెలంగాణలో బిజేపిని గెలిపించుకోవాలని కొన్ని లక్షల మంది ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు గెలిపించారు. అయినా ప్రజల మనోగతం బిజేపి నాయకులకు అర్దం కావడం లేదా? తెలంగాణ ఉద్య మకారులైన మల్కాజిగిరి ఎం.పి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను తక్కువగా చూస్తున్నట్లేనా? మెదక్ ఎంపి. రఘునందన్‌రావులు కూడా పార్టీని గెలిపించలేరని నిర్ణయానికి వచ్చారా? ఆంద్రా నాయకులకు ఇంకా ఊడిగం చేయడానికే బిజేపి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకున్నదా? ఇదిలా వుంటే ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారం విషయంలో బిజేపి నాయకుల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హజరైన ఎంపిలు ధర్మపురి అరవింద్, రఘునందర్ రావులు ఆ సమావేశ వివరాలకన్నా, ఈ ఇద్దరు చేసిన కామెంట్లే ఎక్కువ జనంలోకి వెళ్లాయి. రకరకాల చర్చలకు దారి తీశాయి. అసలు బిజేపి పార్టీ సమావేశంలో ఏం జరిగింది అన్నదానిపై ఎవరూ దష్టిపెట్టలేదు. ఆ సమావేశంలో ఏమైందన్న వార్తలు పెద్దగా ప్రజల్లోకి వె ళ్లలేదు. మీడియాలో కూడా అది వార్తకాలేదు. కాని ఇద్దరు ఎంపిలు చేసినవ్యాఖ్యలు మాత్రమే పెద్ద రచ్చకు దారి తీశాయి. వాళ్లు నిజంగానే మేమిద్దరం కలిస్తే తెలంగాణలో బిజేపి ఓ రేంజ్‌లో వుంటుందని అన్నారా? లేక మీడియా అడిగింది కదా? అని చెప్పారా? అనేది వాళ్లిద్దరే చెప్పాలి. కాని చెప్పరు. ఓ మాట వదిలేస్తారు. సమాజానికి నాయకులు సవాలు విసురుతారు. ఈ అంశం కొంత కాలం సమాజంలో నానుతుంది. నాయకుల్లో కూడా చర్చకు దారి తీస్తుంది. దానికి ఇక హద్దూ బద్దూ వుండనంత దూరం వెళ్తుంది. అవసరమైతే నాయకుల మధ్య అగాదాలకు దారి తీస్తుంది. ఆఖరుకు విషయం తేలుతుంది? ఇలాంటివి ప్రతిసారి వస్తూనే వుంటాయి. పోతూనే వుంటాయి. అయినా రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు కొత్తగానే వుంటాయి. నాయకుల మధ్య రాజకీయాలకు వేదికలైతుంటాయి? ఈ ఇ ద్దరు చేసిన వ్యాఖ్యలపై మీడియా కనిపించిన ప్రతి నాయకుడిని ప్రశ్నిస్తూనే వుంటాయి. ఎంపిలు రఘునందన్‌రావు, అరవింద్‌లు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు? అని ఇతర నాయకులను మీడియా ప్రశ్నిస్తుంది. దానికి ఇతర నాయకులు కూడా నేరుగా సమాదానం చెప్పలేరు. నేను వినలేదని కొందరంటారు? అవునా..ఎప్ప్పుడన్నారు? అని మరికొందరు ఎదరు ప్రశ్నిస్తారు? మంచిదే కదా? అని సర్ధుకుపోయినట్లు కొంత మంది సమాదానం చెబుతారు? అందరికీ అన్నీ తెలుసు. కాని ఇలా మీడియాను ముందు రకరకాý వ్యాఖ్యలు చేయడంతో ఆ ఇద్దరి మాటలకు మరింత ప్రాదాన్యత పెరుగుతుంది. ఇప్ప్పుడు ఇదే జరిగింది. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు చేయడంతో అంతరార్ధమేమిటీ? అనే ప్రశ్నలు బిజేపిలో తలెత్తుతున్నాయి. అంటే మిగతా నాయకులు వున్నా, లేనట్లేనా? వాళ్లు అంత సమర్ధులు కాదా? అని బిజేపి శ్రేణుల్లో, ఆయా నాయకుల అభిమానుల్లో చర్చ మొదలైంది. నిజానికి ఈ ఇద్దరికీ ఎప్పటి నుంచో పార్టీ అద్యక్షపదవి కావాలని కోరిక వుంది. ఎంపి అరవింద్‌కు ఎంపి అయినప్పటి నుంచి వుంది. రఘనందన్‌రావుకు ఎమ్మెల్యే కాకముందు నుంచే వుంది. ఆ కోరిక తీర్చుకోవాలన్న ఆలోచన ఇద్దరికీ వుంది. బండి సంజయ్ ను పక్కకు తప్పించి, గత ఎన్నికల ముందు అప్పటికే కేంద్ర మంత్రిగా వున్న కిషన్‌రెడ్డికి మరోసారి అధ్యక్షబాద్యతలు అప్పగించారు. రెండోసారి కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపిగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. అయినా అధ్యక్షపదవి కిషన్‌రెడ్డి వద్దే వుంచారు. ఆరు నెలల క్రితం కొత్త అద్యక్షుడి ఎంపిక సమయంలో నాకంటే నాకు అని అ ందరూ ముందుకు వచ్చారు. ఆఖరుకు బండి సంజయ్ తనకు మంత్రి పదవి వద్దు. అధ్యక్షపదవే ముద్దు అని కూడా అనుకున్నారు. కాని మళ్లీ ఆయనకు ఇ వ్వలేదు. ఆ సమయంలో అందరూ పోటీ పడ్డారు. మహాబూబ్ నగర్ ఎంపి. డికే. అరుణ కూడా పదవి కోరుకున్నారు. అరవి ంద్, రఘునందన్‌రావులు కూడా మాకేం తక్కువ అన్నారు. ఇక ఈటెల రాజేందర్‌కు పదవి వచ్చినట్లే, బిజేపి అద్యక్షుడు అయినట్లే, ప్రకటన ఒక్కటే ఆలస్యం అన్నట్లు కొన్ని నెలల పాటు వార్తలు వచ్చాయి. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామంచంద్రరావుకు అద్యక్షపదవి దక్కింది. అప్పటి నుంచే పార్టీలో మరింత నిస్తేజం ఏర్పడింది. బండి సంజయ్‌ను పక్కకు తప్పించడంతో ఒక్కసారిగా బిజేపిలో ఊపు చల్లారిపోయింది. అంత వరకు ఇక బిజేపికి ఎదురు లేదు. తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో బండిని తప్పించారు. అప్ప్పుడే బిజేపి శ్రేణుల్లో ఆశలు ఆవిరయ్యాయి. అనుకున్నట్లుగానే బిజేపి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైంది. అంతకు కనీసం 30 సీట్లైనా బిజేపి గెల్చుకుంటుంది అనుకున్నారు. బండి సంజయ్ తెచ్చిన ఊపు పుణ్యమా? అని ఆ ఎనమిది వచ్చాయి. తర్వాత పార్లమెంటు 8 గెలిచారు. మళ్లీ బిజేపిలోఆశలు చిగురించాయి. రామచంద్రరావును అద్యక్షుడిని చేయడంతో మళ్లీ ఒక్కసారిగా కమలంలో కలకలం రేగింది. ఇప్ప్పుడు ఈ ఇద్దరి వ్యాఖ్యలతో బిజేపిలో కొత్త చర్చ మొదలైంది? పవన్ కల్యాణ్‌తో తెలంగాణలో ప్రచారం అనేసరికి రచ్చ మొదలైంది? ఇదీ కమలంలో కొనసాగుతున్న కల్లోలం అని చెప్పకతప్పదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version