Watermelon Juice for Workers in Heat
ఉపాధి హామీ కూలీలకు పుచ్చకాయ జ్యూస్ పంపిణీ.
చిట్యాల,నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామంలో బుధవారం రోజున ఉపాధి హామీ కూలీల దాహార్తిని తీర్చేందుకు పుచ్చకాయ జ్యూస్ పంపిణీ చేసినట్లు గ్రామ సర్పంచి గుంటుపల్లి నాగమల్లెశ్వరరావు ఉప సర్పంచి ముద్దన నాగరాజు తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండడానికి ఉపాధి కూలీలకు పుచ్చ జ్యూస్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ శివ, వార్డు మెంబర్లు పాశం లత, కంకణాల శ్రీనివాసు, కారోబార్ యుగంధర్, ఉపాధి హామీ కూలీలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
