Pink Cadres Coordination Meeting Held
గులాబీ శ్రేణుల సమన్వయ సమావేషం.
ఆమనగల్లు/ నేటి ధాత్రి :
ఆమనగల్ మండలంలోని అయ్య సాగర్ గ్రామంలో ఏర్పాటుచేసిన గులాబీ శ్రేణుల సమావేశంలో ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియ గురించి అలాగే కెసిఆర్ పథకాలను పల్లె పల్లెనా తీసుకెళ్లి సభ్యత్వంలో వారిని భాగస్వాములను చేయాలనీ గుర్తు చేశారు. భవిష్యత్తులో మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు మళ్ళీ సూపరిపాలన రాబోతుందని గుర్తుచేశారు కల్వకుర్తి లో పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లో సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రజిని,సాయి చంద్ , మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎడమ సత్యం, జూపల్లి భాస్కర్ రావు తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
