Constable Booked for Marrying Minor
మైనర్ ని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్
#మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు!*
నేటి ధాత్రి యాదగిరిగుట్ట:
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాయిని అనిల్ కుమార్ గౌడ్.. ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన మైనర్ బాలికను రహస్యంగా అర్ధరాత్రి వివాహం చేసుకున్నాడు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధిక కట్నం ఆశతో మైనర్ బాలికలను వివాహం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయగా.. అనిల్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
