Tight Vigil on Illegal Cattle Transport
బక్రీద్ వేళ అప్రమత్తం.. పశువుల అక్రమ రవాణాకు చెక్.
అనుమానిత వాహనాలపై కఠిన నిఘా.. శాంతినగర్ వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు
అనంతగిరి, నేటి ధాత్రి :
బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ నేషనల్ హైవే ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. చెక్పోస్ట్ వద్ద వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద రవాణాపై నిఘా కొనసాగిస్తున్నారు. చెక్పోస్ట్ ఏర్పాటును పట్టణ సీఐ శివశంకర్ స్వయంగా పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సుధీర్ కుమార్, ఏఎస్సై జానీ మియా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
