
జమ్మికుంట :నేటిధాత్రి
దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన నీట్ పేపర్ లీకేజీ పై బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ అధ్యక్షతన స్థానిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం బి ఆర్ ఎస్ వి నాయకులు కొమ్ము నరేష్ హరీష్ వర్మ మాట్లాడుతూ 24 లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు గత 20 రోజులుగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఈ రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెలగాట మాడుతున్నాయి
కేంద్రంలో పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్ష వినేతలకు నీట్ అవకతవకలపై మాట్లాడే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీట్ అవకతవకలపై మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు మెదకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేసి నిరుద్యోగులను విద్యార్థులను ఉసిగొలిపి అధికారం వచ్చిన తర్వాత విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యోగులను విస్మరించి నా రేవంత్ రెడ్డికి త్వరలోనే తగు బుద్ధి చెప్తామని ఇప్పటికైనా నీట్ విద్యార్థుల పక్షాన నిలబడి ఈ రాష్ట్రంలోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించే విధంగా సుప్రీంకోర్టుని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరాలని డిమాండ్ చేయడం జరిగింది లేనియెడల రాబోయే రోజులలో విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను ఏకం చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా చలామణి అవుతున్న బండి సంజయ్ కిషన్ రెడ్డి లు ఎందుకు నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే దిశగా పోరాటం చేయడం లేదని అధికారం కోసం పరితపించుడే మంత్రులను పరితపించుండే మంత్రులను భవిష్యత్తులో రోడ్డుమీద తిరగనియ్యమని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు రాపర్తి అరవింద్ గౌడ్ చింతల కౌశిక్ పర్లపెల్లి శ్రీనివాస్ పాతకాల అజయ్ పాకాని రమేష్ తదితరులు పాల్గొన్నారు