MRPS Leader Suresh Birthday Celebrations
ఘనంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ జన్మదిన వేడుకలు
మహాదేవపూర్ నేటి ధాత్రి
మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రెసిడెంట్ చింతకుంట్ల సదానందం ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం చింతకుంట్లసదానందం మాట్లాడుతూ…మండల కేంద్రంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి దళితుల పక్షాన బలమైన గొంతుకై నిలుస్తున్నారని దళితుల సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్న యువ నాయకునికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ మజ్జిగ ప్యాకెట్లను అందించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్ పలువురు బిసి నాయకులు సార్ల అనిల్ పిట్టల మధు దళిత సంఘ సీనియర్ నాయకులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంగం రాష్ట్ర నాయకులు లింగాల రామయ్య సీనియర్ నాయకులు నల్లబూగ ధర్మయ్య ఎమ్మార్పీఎస్ యువసేన మండల అధ్యక్షులు మంథని రవితేజ చింతకుంట్ల రాము చింతకుంట్ల సాయి లింగాల సాగర్ లింగాల సుశాంత్ కొలుగూరి శ్రీకాంత్ కొలుగూరి సుమన్ చింతకుంట్ల కృష్ణ తుంగ పిండి శివ తదితరులు పాల్గొన్నారు
