చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభా విద్యాలయంలో బుధవారం ప్రవేట్ పాఠశాలల కరస్పాండెంట్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ట్రస్మా మండల కార్యవర్గంను ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడుగా కొడగంటి గంగాధర్, ఉపాధ్యక్షులుగా ఏనుగుల కృష్ణ, కోశాధికారిగా రాజూరి సద్గుణ చారి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. అనంతరం నూతన అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్లు నాగరాజు , రాజేశ్వరరావు పాల్గొన్నారు.