Demand to Appoint Chandramouli as Town Congress President
కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష పదవికి చంద్రమౌళి కి ఇవ్వాలి
మేకల దేవరాజ్
పరకాల,నేటిధాత్రి
https://youtu.be/mcDL0nNP5s0?si=v0NCLlrD99MLD5Tk
పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవి నియామకంపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, బొమ్మకంటి చంద్రమౌళి పేరును ప్రతిపాదిస్తూ మేకల దేవరాజ్ వినతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమౌళి గత 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్యూఐ,యూత్ కాంగ్రెస్,ఇందిరా కాంగ్రెస్ వంటి విభాగాల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి సేవలందించినట్లు తెలిపారు.అనేక ప్రజా సమస్యలపై ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీ తరఫున చురుకుగా స్పందించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు తెలిపారు.పార్టీ మారేందుకు వచ్చినఅవకాశాలు,ప్రలోభాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి కొనసాగుతున్నారని,సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషించినట్లు ఆయన వివరించారు.ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ,సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారని,పార్టీ కోసం పనిచేసిన చంద్రమౌళికి పట్టణ అధ్యక్ష పదవి కేటాయిస్తే తగిన గుర్తింపు లభిస్తుందని, అధిష్టానం ఈ విషయాన్ని పరిశీలించాలని మేకల దేవరాజ్ కోరారు.
