పరిశీలించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.
కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 07
మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని మంగాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డీఈ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ చారి మరియు కాలనీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, కనకయ్య, సురేష్ బాబు, సాయి కుమార్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.