ennikala nirvahanapia avagahana kaligi undali, ఎన్నికల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి

ఎన్నికల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి స్థానిక ఎన్నికల నిర్వహణ పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మండల ఎన్నికల అధికారిణి, దుగ్గొండి ఎంపిడివో గుంటి పల్లవి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో 187 మంది పిఓ, ఏపిఓలకు ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. ఓటర్లు ఓటు వేసే విధానం పట్ల, ఓటు వేశాక బ్యాలెట్‌ పత్రం మడత చేసే విధానంతోపాటు పలు అంశాలను పూర్తిస్థాయిలో అధికారులతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో…

Read More

thvaralo kulo disaster management course, త్వరలో కెయులో డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు

త్వరలో కెయులో డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో డిసాస్టర్‌ మేనేజిమెంట్‌ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టాలని మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్‌.సాయన్నను వరంగల్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కోశాధికారి ఎం.నాగయ్య, రాష్ట్ర మేనేజింగ్‌ కమిటీ సభ్యుడు ఈ.వీ.శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యుడు బొమ్మినేని పాపిరెడ్డి కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఆర్‌.సాయన్న మాట్లాడుతూ ఏదేని డిసాస్టర్‌ జరిగినపుడు ఏ విధంగా ప్రాణాలను కాపాడుకోవాలని, ఆస్తి, ప్రాణనష్టం…

Read More

Zillalo bjp nayakula arrestulu, జిల్లాలో బిజెపి నాయకుల అరెస్టులు

జిల్లాలో బిజెపి నాయకుల అరెస్టులు ఇంటర్‌ విద్యార్థుల మార్కులలో జరిగిన అవకతవకలపై శాంతియుతంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను అప్రజాస్వామికంగా అడ్డుకొని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ను ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఉదయం నాలుగుగంటల నుండే బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం బిజెపి వరంగల్‌…

Read More

ktrni kalisina warangal nuthana mayor, కేటీఆర్‌ని కలిసిన వరంగల్‌ నూతన మేయర్‌

కేటీఆర్‌ని కలిసిన వరంగల్‌ నూతన మేయర్‌ నూతనంగా గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికైన గుండా ప్రకాష్‌ మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్‌గా ఎంపికైన ప్రకాష్‌ని కేటిఆర్‌ అభినందించారు. నూతన మేయర్‌తోపాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్లమెంట్‌ సభ్యులు పసునూరి దయాకర్‌, బండా ప్రకాష్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, రాష్ట్ర సమితి మహిళా విభాగం…

Read More

adrushyashakthula anda unddi maku adevadu…?, అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…?

అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…? నేటిధాత్రి బ్యూరో : ఆయనగారు ఓ కార్పోరేటర్‌ భర్త మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయి వ్యాపారంలో దివాలాతీసి దిక్కుతోచని స్థితిలో ఉండేవాడు. ఏ ‘అల్లాఉద్దీన్‌ అద్భుత దీపమో’ దొరికి ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడో అనుకుని పిక్స్‌ అయిపోకండి. కేవలం పేద ప్రజల భూములు కబ్జా చేసి తినడానికి తిండి లేని వారిని ఏదోరకంగా బురిడి కొట్టించి, దివాళా తీసిన కార్పోరేటర్‌ భర్త కాస్త ప్రస్తుతం వంద ఎకరాలకు పైగా ఆస్తులకు…

Read More

samanvayamtho panicheyali : cp doctor v.ravinder, సమన్వయంతో పనిచేయాలి : సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

సమన్వయంతో పనిచేయాలి : సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ నేరాలకు పాల్పడిన నేరస్థులకు కోర్టులో నేరం నిరూపించబడి శిక్షలు పడాలంటే పోలీసులు, ప్రాసిక్యూషన్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సి వుంటుందని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. కలెక్షన్‌ ఆఫ్‌ ఎవిడేన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్టిగేషన్‌ ప్రోసిజర్స్‌ ఫ్రం ఎఫ్‌ఐఆర్‌ టూ చార్జ్‌షీట్‌ అంశంపై వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెమినార్‌ను శనివారం పోలీస్‌ పోలీస్‌ కమీషనర్‌ ప్రారంభించారు. డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ ప్రాసీక్యూషన్స్‌ వరంగల్‌…

Read More

nadiche daredhi…, నడిచే దారేది…

నడిచే దారేది… నడిచే దారే లేదని, బురదమయంగా పాత్రపురం గ్రామ పంచాయితీ మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజి కాలువ వెంట నీరు పోతున్న పట్టించుకొనే నాథుడే లేక తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్‌ను నిర్మించేందుకు ఇరువైపులా శుభ్రం చేసి రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయలేదని గ్రామస్తులు అంటున్నారు. ఏడాది గడిచిన పట్టింపు లేకుండా కాంట్రాక్టర్‌, అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గుంతలు పడినా…నీళ్లు నిలుస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని,…

Read More

warangal mayorga gunda prakash ennika ekagream, వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాష్‌ ఎన్నిక ఏకగ్రీవం..

వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాష్‌ ఎన్నిక ఏకగ్రీవం.. వరంగల్‌ మేయర్‌గా గత డిసెంబర్‌లో నన్నపునేని నరేందర్‌ రాజీనామా చేసి తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్బంగా ఖాళీ అయిన మేయర్‌ స్థానానికి శనివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటీల్‌ వరంగల్‌ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ తన అభ్యర్దిగా ప్రకటించిన గుండా ప్రకాష్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రత్యర్ది పార్టీల నుండి పోటీలో ఎవరు లేనందున కౌన్సిల్‌లో…

Read More

mayorga gunda prakashrao ennika, మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక

మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశరావు ఎంపికయ్యారు. మేయర్‌ పదవి ఖాళీ అయినందున రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ మేరకు అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. శనివారం కార్పొరేషన్‌లో నిర్వహించిన సమావేశంలో గుండా ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్‌ నియామకానికి 29మంది సభ్యుల కోరం అవసరం ఉండగా మొత్తం 50కి పైగా సభ్యులు హాజరయ్యారు. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును కార్పొరేటర్‌ వద్ధిరాజు గణేష్‌…

Read More

mayorga gunda prakashrao ennika, మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక

మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు ఎన్నిక గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశరావు ఎంపికయ్యారు. మేయర్‌ పదవి ఖాళీ అయినందున రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ మేరకు అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. శనివారం కార్పొరేషన్‌లో నిర్వహించిన సమావేశంలో గుండా ప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్‌ నియామకానికి 29మంది సభ్యుల కోరం అవసరం ఉండగా మొత్తం 50కి పైగా సభ్యులు హాజరయ్యారు. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు పేరును కార్పొరేటర్‌ వద్ధిరాజు గణేష్‌…

Read More

business unn varike bank linkege, బిజినెస్‌ ఉన్న వారికే బ్యాంకు లింకేజ్‌

బిజినెస్‌ ఉన్న వారికే బ్యాంకు లింకేజ్‌ బ్యాంకు లింకేజ్‌ బిజినెస్‌ ఉన్న వారికే నాల్గవ లింకేజ్‌ ఇవ్వాలని సూచించామని రాజన్న సిరిసిల్ల జిల్లా మెప్మా పథక సంచాలకులు డాక్టర్‌ కె.వి.రమణాచారి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకు లింకేజ్‌, సెప్‌ టార్గెట్‌ బ్యాంకుల వారిగా తెలిపారు. ఈ సమావేశంలో ఎల్‌డిఎం రంగారెడ్డి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్లు, మెప్మా డిఎంసి ఎం.సుమలత, ఎడిఎంసి భూలక్ష్మి, మెప్మా…

Read More

ennikalaku siddamga unnaam : sp rahul hegde, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : ఎస్పీ రాహుల్‌ హెగ్డే

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : ఎస్పీ రాహుల్‌ హెగ్డే రాబోవు ఎన్నికలు ఫెయిర్‌ అండ్‌ ఫ్రీగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని రకాల భద్రత చర్యలతో సంసిద్ధంగా ఉన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. శుక్రవారం సిరిసిల్లలోని పంచాయతీ రాజ్‌ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ ు ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.శరవణన్‌తో పాల్గొన్నారు. రాబోవు ఎన్నికల నిర్వహణ శాంతియుత వాతావరణంలో నిర్వహించటమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశం కొనసాగింది….

Read More

prajalu jagrathaga vyavaharinthali, ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలి

ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలి ఇటీవల కాలంలో కొంతమంది నేరచరిత్ర గల అంతర్‌రాష్ట్ర ముఠాలు తప్పుడు ధృవపత్రాలు సమర్పించి బ్యాంక్‌ మేనేజర్‌ అంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం వారు బ్యాంకు కస్టమర్లకు పలు సూచనలు చేశారు. బ్యాంకు మేనేజర్‌ను అంటూ మొబైల్‌ సిమ్‌కార్డు పొంది అమాయకులైన బ్యాంక్‌ కస్టమర్‌లకు ఫోన్‌ చేస్తూ హిందీలో మాట్లాడతారని తెలిపారు. బ్యాంక్‌ మేనేజర్‌ను మాట్లాడుతున్న అని పరిచయం చేసుకుని, అకౌంట్‌ పూర్తిగా అప్‌డేట్‌ చేస్తున్నామని,…

Read More

manasika balopetha vidya vidanam ravali : r.laxman sudhakar, మానసిక బలోపేత విద్యా విధానం రావాలి: ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌

మానసిక బలోపేత విద్యా విధానం రావాలి: ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌ విద్యార్థులను మానసికంగా బలోపేతం చేసే భారతీయ విద్యా విధానం రావాలని, దాని వల్లనే వ్యక్తిత్వం వికసించి బుద్ధి, వివేకం పెరిగి జయాపజయాలను ఒకే విధంగా స్వీకరిస్తారని, తద్వారా అ నుత్తీర్ణులు అయినప్పుడు ఆత్మహత్యల జోలికి పోరని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ ప్రచార ప్రముఖ్‌ ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌ అన్నారు. శ్రీరామకష్ణ మఠం హైదరాబాద్‌ మార్గదర్శనంలో శ్రీ రామకష్ణ సేవా సమితి హనుమకొండ శాఖ నక్కలగుట్టలోని వివేకానంద హైస్కూల్‌లో నిర్వహిస్తున్న వేసవి…

Read More

warangal vastravyaparaniki gundekaya, వరంగల్‌ వస్త్రవ్యాపారానికి గుండెకాయ

వరంగల్‌ వస్త్రవ్యాపారానికి గుండెకాయ వరంగల్‌ నగరం వస్త్రవ్యాపార రంగానికి గుండెకాయ లాంటిదని కాకతీయ ఆల్‌షాప్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నగరబోయిన బాబురావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఆర్యవైశ్య భవనంలో యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా పేదరికంలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ…

Read More

polycet falithalu vidudala, పాలిసెట్‌ ఫలితాలు విడుదల

పాలిసెట్‌ ఫలితాలు విడుదల తెలంగాణ రాష్ట్ర పాలీసెట్‌-2019 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌ బిఆర్‌కే భవన్‌లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ కార్యాలయంలో టెక్నికల్‌ బోర్డు కమిషనర్‌, చైర్మన్‌ నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ పాలిసెట్‌ ఫలితాలలో 92.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. స్టేట్‌ మొదటి ర్యాంకు సిద్దిపేట జిల్లాకు చెందిన మంకాల సజనకు, రెండవ ర్యాంక్‌ సూర్యాపేట జిల్లాకు చెందిన ఆరురి సాత్విక్‌కు దక్కాయి. ఈ పాలిసెట్‌-2019 పరీక్షలో…

Read More

mamidi pandlatho jagratha, మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి పండ్లతో జాగ్రత్త మామిడి సీజన్‌ వచ్చింది. దోరగా కంటికి ఇంపుగా ఉన్నాయని మామిడి పండ్లను కొని తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. మామిడి పండ్లను అమ్మే వ్యాపారులు మార్కెట్‌లో వ్యాపారాన్ని దష్టిలో ఉంచుకుని పచ్చి మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని వివిధ రకాలుగా మాగబెట్టి ఉంచుతున్నారు. ఇలా ఒక్కరోజు పచ్చి మామిడికాయలను ఉంచితే చాలు రెండురోజుల్లో దోరగా పండిన మామిడి పండ్లు రెడీ. వాటినే వ్యాపారులు మార్కెట్లకు తరలిస్తున్నారు. కంటికి దోరగా పండినట్లు కనబడే…

Read More

prakruthi prakash endariko adarsham: yasmin basha, ప్రకతి ప్రకాష్‌ ఎందరికో ఆదర్శం : యాస్మిన్‌ బాషా

ప్రకతి ప్రకాష్‌ ఎందరికో ఆదర్శం : యాస్మిన్‌ బాషా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న కార్యక్రమానికి సామాజిక సేవకుడు ప్రకతి ప్రకాష్‌ శ్రీకారం చుట్టడం ఎంతో గొప్ప విషయమని సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రకతి ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులలో ఉచితంగా చల్లని నీరు పంపిణీ కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎవరి స్వార్థం…

Read More

vidyarthini atmahatyayatnam, విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం

విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన జామాండ్ల అంజలీ పరీక్ష ఫెయిల్‌ కావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటర్‌లో ఫిజిక్స్‌ పరీక్ష ఫెయిల్‌ అయిన నేపథ్యంలో మనస్థాపానికి గురై కిరోసిన్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబసభ్యులు, బంధువులు అంజలిని హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజలి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అంజలి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అంజలి నెక్కొండ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం…

Read More

rajinama yochanalo mantri jagadesh reddy…?, రాజీనామా యోచనలో మంత్రి జగదీష్‌రెడ్డి…?

రాజీనామా యోచనలో మంత్రి జగదీష్‌రెడ్డి…? ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలు, నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాల మూలంగా విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఆయన తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది. వీటన్నింటికి తాను నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని జగదీష్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలగజేసుకుని నష్టనివారణ చర్యలు చేపడుతూ ఉచిత వెరిఫికేషన్‌ చేయాలంటూ…

Read More
error: Content is protected !!