Candlelight Rally in Kohir for Justice
నాగర్ కర్నూల్ ఘటనపై కోహిర్ లో కొవ్వొత్తి ర్యాలీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ కొమ్మెర గ్రామంలో 2 నెలల పసికందును చంపిన ఘటనపై కోహిర్ గ్రామ యువకులు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘We Want Justice’ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కౌన్సిలర్ నాగరిగారి సంపత్ కుమార్ పాల్గొన్నారు. మానవత్వం మంట కలిసిపోయిందని, దేవుడిని పూజించుకోవడానికి స్వేచ్ఛ లేని రాష్ట్రంలో బ్రతుకుతున్నామని, కన్న కూతుర్ని చంపిన దుండగులను శిక్షించాలని ఒక బాలింత తల్లి పోరాటానికి అండగా ఈ నిరసన ర్యాలీ నిర్వహించినట్లు యువకులు తెలిపారు.
