ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం
వనపర్తి నేటిధాత్రి:
మాజీమంత్రి
నిరంజన్ రెడ్డి మంజూరు చేయించిన అభివృద్ధి పనులు పూర్తి చేయలేనీ
యాసంగి సాగు నీరు నిలిపి రైతుల నోట్లో మట్టి కొట్టిన .
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా అ,అవినీతితో బి.ఆర్.ఎస్ నాయకులు విమర్శించారు నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశములో బీ ఆర్ ఎస్ నేతలు మాట్లాడారు.జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ
కాంగ్రెస్ అసమర్థత వల్ల రైతులకు యాసంగికి సాగునీళ్ళు ఇవ్వడం లేదని,కె.సి.ఆర్ హయాములో ఒక లక్ష 24వేల ఎకరాలకు వానకాలం,యాసంగికి నీళ్ళు ఇచ్చామని అన్నారు ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఉన్న జిల్లా సాగు విస్తీర్ణం ఎంత నీటి వాడకం ఎంత అంచనా వేయకపోవడం వారి అసమర్థత విమర్శించారు.
నిరంజన్ రెడ్డి ముందుచూపుతో పాలమూరు, రంగారెడ్డి,ఎదుల రిజర్వాయర్,ఏలూరు రిజర్వాయర్ పూర్తి చేసి సాగు నీళ్ళు అందించిన ఘనత నిరంజన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. జిల్లా మంత్రులు వాస్తవ పరిస్థితులు,చేసిన తప్పులను రైతులకు చెప్పి క్షేమాపణ చెప్పా లని డిమాండ్ చేశారుమాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్ మాట్లాడుతూ.కాంగ్రెస్ పాలనలో కరెంట్ 7గంటలు మాత్రమే వచ్చేదని రైతులు ట్రాఫర్మ్స్ కాలిపోయి,పాము కాట్లకు గురై మరణించేవారని అటువంటిది కె.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో 24గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులను కన్న బిడ్డలుగా కాపాడారని అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అనాడు 24 గంటలు కరెంట్ వస్తలేదని మొత్తుకున్నారు మరి మీ హాయంలో ఎక్కడ 24 గంటల కరెంట్ వస్తాలేదు దీనికి మీరు సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు.
డిప్యూటీ సి.ఎం ను తప్పుదోవ పట్టించి టెండర్ లేని సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేయించారని ఆరోపించారునిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో అనేక సబ్ స్టేషన్ లు మంజూరు చేయించి రైతులను కాపాడారని అన్నారు.
తల్పనూర్, ఎదుల సబ్ స్టేషన్ లు కూడా నిరంజన్ రెడ్డి గారు పూర్తి చేశారని అంటూ వాళ్ళ ప్రారంభం మంది పైసలతో మంగళహారతులు పాడినట్లు ఉందని ఎద్దేవా చేశారజిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం అని ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు.
నిరంజన్ రెడ్డి హయాములో మజురైనా పాలిటెక్నిక్ దురస్తు, జె.ఎన్.టి.యు, ఐ.టి.టవర్, రోడ్ల విస్తరణ ఏడాది అయిన అభివృద్ధికి నోచుకోలేదని అన్నారుకొత్త నిధుల ఊసులేదు కాబట్టి మాజీ మంత్రి మంజూరు చేయించిన బైపాస్,మార్కెట్ యార్డ్, ఐ.టి.టవర్ వంటివి పూర్తి చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ జి.ఓ 46ఎత్తివేసి అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సి.యం.2లక్షల ఉద్యాగాల ఇస్తామని యువతను మోసం చేశారని దుయ్యబట్టారు.
ఎస్ డి ఏ ఫ్ నిధులు 50కోట్లు ఖర్చు చేయలేని దీనస్థితి ప్రభుత్వానిది అని జె.ఎన్.టి.యు కు వచ్చిన 32కోట్లు ఖర్చు చేయలేని దీనస్థితి ప్రభుత్వానిది బీ ఆర్ ఎస్ నేతలు విమర్శించారు.
ఈ విలేకరుల సమావేశంలో బి.లక్ష్మయ్య,పి.కురుమూర్తి యాదవ్,పి. రమేష్ గౌడ్,గంధం. పరంజ్యోతి, రఘుపతి రెడ్డి,జగన్నాథం నాయుడు,వెంకటస్వామి,నందిమల్ల.అశోక్, రాళ్ళ.కృష్ణయ్య, దొడ్ల.రాములు,కె.మాణిక్యం,మాధవ్ రెడ్డి,రఘుపతి రెడ్డి, గౌడ్ నాయక్, కుమార్ యాదవ్,చిట్యాల.రాము, జోహెబ్ హుస్సేన్,మహేశ్వర్ రెడ్డి,వజ్రాల.రమేష్ నందిమల్ల.అశోక్
జిల్లా మీడియా కన్వీనర్ పాల్గొన్నారు