రైతు భరోసా పై బీఆర్ఎస్ పార్టీ నిరసన

రైతు భరోసా అన్నదాతకు నిరాశ

రైతు భరోసా పెంచాలని బిఆర్ఎస్ పార్టీ నిరసన సెగ

శాయంపేట నేటిధాత్రి:

ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ప్రతి ఎకరాకు 15 వేల రూపాయలు ఇచ్చేదాకా రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం.బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లిమాజీ శాసనసభ్యులుగండ్ర వెంకటరమణారెడ్డీ, బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు & వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి ఆదేశా నుసారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా పెంచాలని నిరసన తెలపడం జరిగిం ది .రైతు భరోసాతో కాంగ్రెస్ నైజాం మరోమారు రుజు వైంది.15 వేలు ఇస్తా అని చెప్పి 12 వేలు ఇస్తామంటున్నారు రైతులను దగా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ముక్కు నేలకు రాయాలి మాట తప్పిన రాహుల్,రేవంత్ తో సహా అందరు తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి.
రైతు బంధు బకాయిలతో సహా ఎకరానికి 15 వేలు ఇచ్చే వరకు వదలమని హెచ్చరిం చారు కళ్యాణ్ లక్ష్మి కింద ఇస్తా అన్న తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలి,మహిళలకు ఇస్తా అన్న 2500 , స్కూటీ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లత- లక్ష్మారెడ్డి, యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, దాసి శ్రావణ్ కుమార్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, లావుడియా రవీందర్, చిలుకయ్య, బిఆర్ఎస్వి కొముల శివ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మారపల్లి నందం, మాజీ ఎంపిటిసిలు మేకల శ్రీను, గొట్టిముక్కుల స్వాతి- విష్ణువర్ధన్, విజయ- విజయ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండిమొహిబుద్దిన్, మాజీ సర్పంచులు అరకిళ్ల ప్రసాద్, సంజీవరావు, దుంపల మహేందర్ రెడ్డి, వలపదాస్ చంద్రమౌళి , శ్రీనివాసరావు రైతుబంధు సమితి అధ్యక్షులు కర్రు ఆదిరెడ్డి ,సీనియర్ నాయకులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, మేకల వెంకటేశ్వర్లు, సావుల కిష్టయ్య, తరుణ్ బాబు , నిమ్మల మహేందర్, కొమ్ముల రాకేష్, కోల మచ్చయ్య, మోతే సమ్మయ్య, అరకిల్ల వెంకట్, శంకర్, అట్ల తిరుపతి, సంజీవరావు, రియాజ్, పోతుగంటి సుభాష్, కూతాటి రమేష్, మహేందర్, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!