నిబంధనలకు విరుద్ధంగా పత్తి వరి కొనుగోలు చేసే దళారులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి
రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాధారం మల్లయ్య డిమాండ్
రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాధారం మల్లయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పేద రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు పెట్టుబడి సాయం పేరుతో పేద రైతులకు ముందస్తుగానే డబ్బులు ఇచ్చి వారి పంటలు పండగానే సన్నా చిన్నకారు రైతుల దగ్గర పత్తి వరి కొనుగోలు చేసి వడ్డీల రూపంలో వసూలు చేస్తూ పేద రైతుల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణాలు పాటించకుండా పౌరసరఫరాల శాఖ నియమాలను పట్టించుకోకుండా పత్తి వరి కొనుగోలు చేసి అడ్డగోలుగా ధనార్జనయంగా పేద రైతులను మోసం చేస్తున్న నిబంధనలు పాటించని ప్రభుత్వం గుర్తించినటువంటి దళారుల పైన తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పేద రైతులకు న్యాయం జరిగే విధంగా వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ప్రజలకు రైతులకు అవగాహన కల్పించి నమ్మకం కలిగే విధంగా సంబంధిత అధికారులు మార్గదర్శకాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.