BJP Objects to Jawahar Nagar GHMC Merger
జవహర్ నగర్ జిహెచ్ఎంసి లో విలీనం పై బీజేపీ నేతల అభ్యంతరాలు
* సంబంధిత అధికారికి లిఖితపూర్వకంగా అభ్యంతరాలు అందజేత
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 15 :
https://youtu.be/FNA9Z2jcGNY?si=-UHZrjOyg8jxN1q8
లక్ష్య ఓటర్లు కలిగిన జవహర్ నగర్ ను కేవలం 2 డివిజన్ లకే పరిమితం చేయడం సరికాదని జవహర్ నగర్ బీజేపీ తూర్పు శాఖ అధ్యక్షులు కర్లపూడి జోగారావు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జవహర్ నగర్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసి లో విలీనం చేసిన సందర్భంగా సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అభ్యంతరాలు తెలపడం జరిగింది. సుమారు లక్ష ఓటర్లు ఉన్న జవహర్ నగర్ ను కేవలం రెండే రెండు డివిజన్ లుగా మార్చడం సరికాదన్నారు. దీంతో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కాబట్టి దీనిని కనీసం మూడు లేదా నాలుగు డివిజన్లుగా చేయాలని కోరడం జరిగిందన్నారు. అంతేకాకుండా గతంలో ఒక డివిజన్లోని ఓట్లను 28 డివిజన్ లలో ఉండడం వల్ల ఓటు వేసే ప్రజలకు అటు కార్పొరేటర్ గా నిలబడిన అభ్యర్థులకు డివిజన్ అభివృద్ధికి ఆటంకంగా నిలవడమే కాకుండా అనేక సమస్యలకు గందరగోళానికి దారితస్తుధన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఏ డివిజన్లోని ఓట్లు ఆదే డివిజన్లోనే ఉండేట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని
జిహెచ్ఎంసి సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేందర్ యాదవ్ గారు, వేపుల సన్నీ, అనిల్ గుప్తా, మైపాల్ రెడ్డి, గిరి కత్తుల వెంకన్న, మందుల శ్రీధర్, మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
