హిందువులతో పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరుడు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని దొరగారిపల్లె లో రామాలయం గుడి నిర్మాణం కొరకు గురువారం శంకుస్థాపన పూజ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ పూజ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు మహిళా సోదరీమణులు హరతులతో వచ్చేసి విజయవంతం చేసినారు.వచ్చిన ప్రజలు మరియు గ్రామ ఒక ముస్లిం బిడ్డ మొహమ్మద్ ఫయాజుద్దీన్ ఈ రామాలయం గుడి నిర్మాణం చేయడం సంతోషంగా ఉంది.అలాగే ఈ ఫయాజ్ ఎప్పుడు గ్రామంలో ఎవరికి ఆపద వచ్చిన ముందుంటాడు.ఎప్పుడు కులామతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం వినాయకుల దగ్గర దుర్గ మాత దగ్గర అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా పేద వారికీ ఆపద ఉంటే ఆదుకుంటాడు.మా ఇందారం గ్రామంలో ఇలాంటి ప్రజల సేవకులు ఉండాలి అని ప్రజలు అంటూ ఉంటే ఫయాజ్ మాట్లాడుతు ఋణం తీర్చుకుంటాను గ్రామ ప్రజల శ్రేయస్సే నా సంతోషం,కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అండగా ఉంటానని నా మతాన్ని పూజిస్తూ అన్ని మతాలకు గౌరవిస్తూ గ్రామ అభివృద్ధి కి అండగా ఉంటా ఈ గుడి మెజార్టీ ప్రజల కోరిక అందుకే రాముడి భక్తులు అందరు నాకు అండగా ఉండి ఈ గుడి తొందరగా పూర్తి చేయుటకు తోడుంటారని ఆశిస్తున్నాను.