Beware of Suspicious Links
అనవసర లింకులతో అప్రమత్తంగా ఉండాలి
సీఐ క్రాంతికుమార్ సూచనలు
పరకాల,నేటిధాత్రి
సోషల్ మీడియా,మొబైల్ మెసేజింగ్ యాప్స్ ద్వారా వస్తున్న అనవసర లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ హెచ్చరించారు.ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు.అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజులు,మింత్ర,మీషో,లాటరీలు గెలిచినట్టు,బహుమతులు అందుకున్నట్టు వచ్చే లింకులను నమ్మవద్దని సూచించారు.ఇలాంటి లింకులను ఓపెన్ చేయకుండా వెంటనే డిలీట్ చేయాలని, సందేహాస్పద పరిస్థితుల్లో సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు.సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తత కీలకమని,చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టాలకు దారి తీసే అవకాశముందని సీఐ క్రాంతికుమార్ పేర్కొన్నారు.అలాగే సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
