Khelo India U-16 Girls Football Begins
ఈ నెల 26 నుండి అశ్మిత ఖేలో ఇండియా బాలికల అండర్ 16 ఫుట్బాల్ పోటీలు.
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఈనెల 26, 27, 28, 29 తేదీలలో అస్మిత ఖేలో ఇండియా బాలికల అండర్ 16 ఫుట్బాల్ పోటీలు సింగరేణి టాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ ఫుట్బాల్ పోటీలు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ మొత్తాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్, 11 స్టార్ పీకేఆర్ ఫుట్బాల్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పి రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. వేసవికాలం దృష్ట్యా క్రీడాకారులకు ఇబ్బంది కలగకుండా ఉదయం ఐదున్నర గంటల నుండి 8 గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి 6:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులంతా 25వ తేదీ సాయంత్రం వచ్చి రిపోర్ట్ చేస్తారని అన్నారు. ఈ టోర్నమెంట్ ముగింపు రోజు బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరవుతారని తెలిపారు. 27వ తేదీ ప్రారంభ వేడుకలను జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాల్గుణ, మందమర్రి ఏరియా సింగరేణి జిఎం, డీసీపీ, ఏసిపి, సిఐ, పట్టణ ఎస్ఐ లు లు పాల్గొంటారని అన్నారు.

టోర్నమెంట్ కు దాతల సహకారంతో క్రీడాకారులకు ఉచిత భోజనం, ఆల్ఫాన్సా పాఠశాలలో, సింగరేణి కాలి క్వార్టర్స్ లల్లో వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. టోర్నమెంట్ కు 180 మంది క్రీడాకారులు,24 మంది రిఫరీలు,12 మంది టెక్నికల్ రిఫరీలు ,ఆర్గనైజర్లు పల్లె రాజు, వోడ్నాల శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్,రామ్ సాయి, శ్రీకాంత్, సిద్దు, ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, సుమారు 20 మంది ఆర్గనైజర్లతో టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల తో మానసికొల్లాసం కలుగుతుందని, రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు విద్యార్థులు టోర్నమెంట్ జరిగే రోజులలో టోర్నమెంట్ ను వీక్షించి విజయవంతం చేయాలని కోరారు.
