ఫెర్టిలైజర్ సీజ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి.

 

లైసెన్స్ ఫెర్టిలైజర్, ది బయో మందుల విక్రయాలు.
ఏలాంటి ఆధారాలు లేకుండా విక్రయాలు.

ప్రోడక్ట్ లేబలింగ్ చేసి విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు.

తమకు అన్నీ ఉన్నాయి ఫెర్టిలైజర్ లో బయో ఫెర్టిలైజర్ అమ్మకాలు సహజం కంపెనీ ఉత్పత్తులు రైతులకు మేలు చేస్తున్నాయి అందుకే కక్ష. యజమాని.

ఏడీ ,ఏ ఓ ,పై విరుచుకుపడ్డ రైతులు, ఆగ్రో స్కై తనిఖీలు సమయంలో అధికారులను నిలదీసిన రైతులు.

తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తే చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించిన రైతులు.

ఫెర్టిలైజర్ లపై ప్రేమతో రైతులకు తక్కువ ధర నాణ్యమైన మందులను అందిస్తున్న అగ్రోస్కైపై చర్యలకు సిద్ధమయ్యారు, వ్యవసాయ అధికారులకు నిలదీసిన రైతులు.

నాలుగు గంటల హై డ్రామా క్రియేట్ చివరికి ఆగ్రో స్కై సీజ్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

ఆగ్రో స్కై పేరుతో వ్యవసాయ క్రిమి సంహార ఎరువుల దుకాణం పై వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేసి సరైన పత్రాలు లేకపోవడంతో అగ్రో స్కై ఎరువుల దుకాణాన్ని సీజ్ చేయడం జరిగింది.శుక్రవారం రోజున మండల కేంద్రంలోని వరంగల్ రోడ్ వైపు ఉన్నటువంటి ఆగ్రో స్కై సీడ్స్ మరియు ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ షాప్ ను
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్,సిహెచ్ సుప్రజ్యోతి వ్యవసాయ అధికారి సముక్తంగా తనిఖీలు చేశారు. ఇతనికి లో ఆగ్రో స్కై ఫెర్టిలైజర్ లో విక్రయాలు జరుగుతున్న గ్రోత్ ప్రమోట్,కీటక రాశినుల, శిలీంద్ర నాశీను, ఇలాంటి క్రిమిసంహారక మందుల పేర్లతో సరైన పత్రాలు బిల్లులు, స్టాక్ రిజిస్టర్, సరుకు సంబంధించిన ఇన్వాయిస్, వివరాలు అందించే లేబల్స్ , తోపాటు రైతులకు రసీదు బిల్లు ఇవ్వకుండా, స్టాక్ బోర్డులో సమాచారం పొందుపరచకుండా విక్రయాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా వివిధ రకాల ఉత్పత్తులను లేబల్, లేని డబ్బాలు, నకిలీ ప్రింటింగ్,స్టిక్కర్లను అటాచ్ చేయడం, కొరకు ఏర్పాటు చేసిన డబ్బాలు, స్టిక్కర్లు మూతలను, తనిఖీల్లో దొరకడంతో అధికారులు వాటిని స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఆగ్రో స్కై ప్రస్తుతం అమ్మకాలకు ఉంచిన 13 లక్షల రూపాయల సరుకులు సీజ్ చేస్తూ స్టాఫ్ సేల్ చేసి, ఆగ్రో స్కై ఫెర్టిలైజర్ షాపులు సీజ్ చేశారు.

ఇదిలా ఉండగా అధికారుల తనిఖీలు పత్రాల వివరాలను సేకరిస్తున్న క్రమంలో అగ్రో స్కై యజమాని తమ షాప్ కు సంబంధించిన పత్రాలు అన్నీ ఉన్నాయని ఫెర్టిలైజర్ తో పాటు జి3 లైసెన్స్ కూడా తమకు కలిగి ఉందని, మా యొక్క ఫెర్టిలైజర్ షాప్ లో పెస్టిసైడ్ తో పాటు అగ్రోస్ కెమికల్ కూడా విక్రయించడం జరుగుతుందని అగ్రో విక్రయించడం సహజమని, తమ విక్రయించే మందుల్లో ఆగ్రోస్ తోపాటు పెస్టిసైడ్ లకు అనుబంధ ఉత్పత్తులను విక్రయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. నాణ్యమైన మందులను కంపెనీ రేట్ ప్రకారంగా విక్రయించడంతో తమ వద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని, అగ్రో స్కై అందించే ఉత్పత్తుల్లో వంద శాతం నాన్యత ఉండడంతో, రైతులు తక్కువ ధరలో తమ పంటల ఉత్పత్తి మరియు పంటలకు నాశనం చేసే పురుగులను రాకుండా తమ ఉత్పత్తులు రైతులకు తక్కువ ధరకే అందించడం, తమపై కక్ష సాధించి తమ దుకాణానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తున్నారని అగ్రో స్కై యజమానురాలు అన్నారు.

ఇదిలా ఉండగా స్వయంగా కొందరు రైతులు పక్క ఫెర్టిలైజర్ కు వచ్చిన రైతులను ఇక్కడికి పంపి, మరోవైపు వ్యవసాయ అధికారులే రైతుల సమక్షంలో పంచనామా కొరకు పిలిచిన రైతులు, అధికారులపై తిరగబడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆగ్రో స్కై విక్రయిస్తున్న ఉత్పత్తులు వంద శాతం రైతులకు మేలు చేస్తున్నాయని వ్యవసాయ శాఖ పిలిచిన రైతులే చెప్పడం మరింత ఆశ్చర్యం. నాణ్యత కలిగిన మందులు తక్కువ ధరకు విక్రయిస్తే తప్పేమిటి రైతుల పంటలకు నష్టం కలగడం లేదు కదా, ఆంధ్రాలోని గుంటూరు తో పాటు ఇతర ప్రదేశాల నుంచి కూడా మందులు తీసుకు వస్తున్నాం, వేల రూపాయలు ఖర్చుపెట్టినప్పటికీ మందుల ఉపయోగం లేకపోవడంతో అనేక పంటలు చేతికి రాకుండా పోతే, అప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా అని రైతులు ఏవో మరియు ఏడీఏలకు ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న ఫెర్టిలైజర్ లల్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తే మీరు తనిఖీలు ఎందుకు చేయడం లేదు, అనేక ఫిటిలైజర్లలో నిషేధిత గడ్డి మందు దర్జాగా విక్రయిస్తే చూసి చూడనట్టుగా ఉండడానికి కారణం ఏమిటని సూటిగా ప్రశ్నించారు, స్థానిక ఏరువుల దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లు విక్రయిస్తుంటే మీరు ఎప్పుడైనా తనిఖీలు చేసి చర్యలు తీసుకున్నారా అంటూ మీరు ఫెర్టిలైజర్ వారు పంపితే ఇక్కడికి వచ్చి రైతులకు మేలుచేసే ఆగ్రోస్కై ఎరువుల దుకాణానికి కాగితాలు లేవు అంటూ డొంక తిరుగు సమాధానాలు, ఇస్తున్నారని రైతులు అధికారుల తనిఖీపై ఫెర్టిలైజర్ నిర్వాహకులతో అధికారులు కుమ్మక్కైనట్టు బాంబు పేల్చారు.

ఆగ్రో స్కై ఫెర్టిలైజర్ దుకాణం లో వ్యవసాయ అధికారుల తనిఖీ ఒక హై డ్రామా స్క్రీన్ క్రియేట్ అయింది. ప్రధాన రహదారి కావడంతో పాదాచార్యులు వాహనదారులు బరువు పక్క రైతులు ఆ గ్రూప్ కి ఫెర్టిలైజర్ లోపల మరియు బయట ఒకటిన్నర నుండి సుమారు నాలుగున్నర వరకు నాలుగు గంటల పాటు హై డ్రామా స్క్రీన్ కొనసాగింది. ప్రస్తుతం మండలంలో ఆగ్రో స్కై పై వ్యవసాయ శాఖ అధికారుల తనకి దుకాణాన్ని సీజ్ చేయడం, పలు రకాల అనుమానాలు వ్యక్తమై” ఆగ్రో స్కై వ్యవసాయ శాఖ చర్యలు. ఇప్పుడు హాట్ టాపిక్ లా మారింది. ఏ డి ఏ ఏవో మాత్రం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ విక్రయాలు జరుపుతున్నారని అందుకే షాపులు సీజ్ చేయడం జరిగిందని అంటున్నారు. అగ్రో స్కై ఫెర్టిలైజర్ షాప్ సీస్ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సిందే…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!