నిషేధిత పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవు.

చిన్నారులకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు.
విద్యతోనే గ్రామాల్లో వెలుగు. పోలీస్ అమీన్, పవన్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి :

గుట్కా గుడుంబా లాంటి నిషేధిత పదార్థాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ అన్నారు. శనివారం రోజు మండలంలోని బెగ్లూర్ గ్రామంలో కార్టెన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించి, గ్రామంలో ప్రతి ఇంటిని క్షుణంగా పరిశీలించారు, అనంతరం ప్రధాన కూడలి వద్ద గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, అసంఘీక కార్యక్రమాలు చే పట్టకూడదని, గ్రామంలో అనుమానిత వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వాలని అన్నారు..విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించాలని విద్యతోనే గ్రామాలు వెలుగులోకి వస్తాయని, గ్రామాల్లో సమస్యలు ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ గ్రామస్తులకు తెలిపారు. అలాగే చిన్నారులకు వాహనాలు ఇవ్వద్దని, ఇస్తే తల్లిదండ్రుల పై చర్యలు తీసుకుంటామని అన్నారు గ్రామంలో నెంబర్ ప్లేట్ లేని 15 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కార్టెన్ సర్చ్ కార్యక్రమంలో రెండవ ఎస్ ఐ, చక్రపాణి, సివిల్ సిఆర్పిఎఫ్ బలగాలు, గ్రామస్తులు యువకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *