ఈరోజు అనగా 10 అక్టోబర్ 2023 రోజున నల్లగొండ జిల్లా ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం జరుపుటకు సన్నాహక కమిటీ ఏర్పాటు చేయటం కొరకు రేపు అనగా 11 అక్టోబర్ 2023 రోజున మధ్యాహ్నం 2.00 గంటలకు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నలగొండలో నల్లగొండ జిల్లా ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయనైనది. కావున అన్ని గ్రామాల మరియు మండలాల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు సర్పంచులు మొదలగువారు పార్టీలకు సంబంధం లేకుండా హాజరు కావాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల సోమ మల్లయ్య ముదిరాజ్ కోరినారు. ఈ సమావేశంలో పందిరి శ్రీనివాస్ ముదిరాజ్, కావలి ఆంజనేయులు ముదిరాజ్, ఈటెల వెంకటేశ్వర్లు ముదిరాజ్, నారబోయిన రవి ముదిరాజ్, బోళ్ల వెంకట్ ముదిరాజ్, లోకనబోయిన రమణ ముదిరాజ్, నాశ బోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్, సంగెపు సురేష్ ముదిరాజ్, కట్టా సుధాకర్ ముదిరాజ్, పందిరి దినేష్ కుమార్ ముదిరాజ్, తలారి యాదగిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.