Love Marriage Sparks Family Clash in Khammam
కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై.. పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు.
- పెళ్లికొడుకు బాబాయిపై కత్తులు, కర్రలతో యువతి కుటుంబీకుల దాడి
కూసుమంచి(ఖమ్మం): వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై.. పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. అంతే..ఆ ఫొటోలు, వారి ప్రేమ, పెళ్లి యువకుడి బాబాయిపై ఏకంగా కత్తులు, కర్రలతో దాడిచేసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ ప్రేమజంట వివాహానికి పెళ్లికొడుకుకు వరుసకు బాబాయి, పిన్నయ్యే వడిత్య హేమ్లా, బుజ్జి కారణమన్న అనుమానంతో పెళ్లికూతురు తరపువారు శుక్రవారం ఉదయం 7గంటల స మయంలో హేమ్లా ఇంటికి వచ్చి కత్తులు, కర్రలతో దాడిచేయడంతో కత్తిపోట్లకు గురయ్యాడు.
