ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.
మెట్ పల్లి జూన్ 20 నేటి ధాత్రి:
మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చే కంటి పరీక్షలు చేశారని దాదాపు 300 మంది కంటి వైద్య శిబిరానికి హాజరైనారు .
ఇందులో 50. మందికి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి లయన్స్ క్లబ్ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రేకుర్తి హాస్పిటల్కు పంపించడం జరిగిందని అక్కడ ఆపరేషన్ చేసి అనంతరం తిరిగి ఆత్మకూర్ గ్రామం కు ఉచితంగానే బస్సులో తీసుకు వస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకొని లబ్ధి పొందాలని అదేవిధంగా సంవత్సరం ఆరు సార్లు కంటి వైద్య శిబిరం రెండుసార్లు గుండె వైద్య శిబిరం చేస్తామని ఇటీవల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని పట్టణ గ్రామీణ ప్రజలు అత్యధిక మంది సద్వినియోగం చేసుకున్నారని ప్రభుత్వ పాఠశాలలో గాని హాస్టల్లో గాని ఇతర పేదవారికి ఫుట్పాత్ వ్యాపారులకు అంబ్రెల్లాల్సు లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా అందిస్తుందని పట్టణ గ్రామీణ ప్రజలు లయన్స్ క్లబ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్ క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, వెల్ముల శ్రీనివాసరావు, మర్రి భాస్కర్,ఆల్ రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.