
MP Gurumurthy
*తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి పరిష్కారం చూపండి..
*కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి బేటీ..
*త్వరలోనే తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం..
*కేంద్ర మంత్రి
గడ్కరీ హామీ..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:
తిరుపతి పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారులకు సంబందించిన సమస్యలు, ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖా మాత్యులు నితిన్ గడ్కరీతో బేటీ అయ్యారు.
ఈ సందర్బంగా నాయుడుపేట, తూర్పు కనుపూరు జాతీయ రహదారి -71లో ప్యాకేజ్ 4, వరగలి క్రాస్, తూర్పు కనుపూరు జాతీయ రహదారి-516 డబ్ల్యూ ప్యాకేజ్ 2లో సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు మంజూరు చేసి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు.
ఈ రహదారుల్లో రూపొందించిన అండర్ పాస్ ల డిజైన్ కారణంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతుల పొలాలలో రహదారులు నిర్మిస్తున్నందున వారికి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు.
రైతులు ప్రదానంగా రహదారికి ఒక వైపు నుంచి మరో వైపుకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలిచేందుకు, వ్యవసాయ సామగ్రిని తీసుకెళ్లేందుకు అనువుగా సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు అవసరం అని ఆయనకి వివరించారు.
ఆయా ప్రాంతాలలో రైతులు చేపట్టిన ఆంధోళన కార్యక్రమాల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
సర్వీసు రోడ్లు, అండర్ పాస్ లు కావాలని రైతులు అందించిన వినతి పత్రాలతోపాటుగా సమగ్రమైన వివరాలను ఆయనకు అందజేశారు.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ ఈ రహదారులకు సంబందించి మరోసారి పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అదికారులను ఆదేశించారు.
తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా డిజైన్ లలో స్వల్ప మార్పుల కారణంగా ఆలస్యమైనదని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారని ఎంపీ తెలియజేశారు.
రేణిగుంట, నాయుడుపేట మధ్య జాతీయ రహదారిపై నుండి సర్వీసు రోడ్లకు ప్రవేశం లేదని, ప్రస్తుత డిజైన్ స్థానిక ప్రజలకు అసౌకర్యంగా ఉందని ఆయనకి వివరించారు.
అలాగే ఈ రహదారిపై శ్రీకాళహస్తి నుండి ముచ్చువోలు, వెంకటగిరిల రోడ్డును కలిపేందుకు యాక్సెస్ రోడ్డు, చావలి నుండి గుర్రపుతోట జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ, చిల్లకూరు నుండి గుర్రపుతోట వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని అభ్యర్దించారు..