అంగడి…సర్కారీ వారి పాట…!21,లక్ష పదిహేను వేలు
వేలం పాటలో అంగడిని దక్కించుకున్న మాజీ సర్పంచ్ బట్టు శ్రీను
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీ నందు అంగడి( సంత) బహిరంగ వేలం పాట పురపాలక సంఘ కార్యాలయం నందు కేసముద్రం మున్సిపల్ కమిషనర్ కె, ప్రసన్న రాణి ఆదేశాల మేరకు ఆర్ ఓ, ఎల్. కుమార్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం నందు వేలం పాట నిర్వహించడం జరిగింది.ఇట్టి వేలం పాటలో 6గురు పాటదారులు పాల్గొనగా వేలం పాటలో అత్యధిక రేటు పాడిన
కేసముద్రం మాజీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, రూ :21,15,000/-లకు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సింగని. ప్రభాకర్, బిల్ కలెక్టర్లు రాము, సంతోష్ సిబ్బంది పాలుగోన్నారు.